|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కి షాకింగ్ సర్జరీ! అభిమానులే కారణమా? అసలు ఏమైందంటే?

Published: 11-07-2026, 4:23 AM
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కి షాకింగ్ సర్జరీ! అభిమానులే కారణమా? అసలు ఏమైందంటే?

పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సంచలన వార్త! ఆయనకు జరిగిన సర్జరీ, ఆ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. అసలు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి!

Key Points

1

పవన్ కళ్యాణ్‌కి ముంబైలో కుడి భుజానికి మూడున్నర గంటల సర్జరీ విజయవంతం పూర్తైంది.

2

రెండు నెలల్లో ఎడమ భుజానికి మరో శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు స్పష్టం చేశారు.

4

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు; వైద్యుల పర్యవేక్షణలో పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు.

సర్జరీకి కారణం అభిమానులేనా? షాకింగ్ నిజం!

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. కుడి భుజానికి సర్జరీ చేశారు. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరం అని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకున్నారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో మొదటగా కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు.

పవన్‌కు ఎప్పటినుంచీ ఈ గాయాలు? పూర్తి వివరాలు!

పవన్ కళ్యాణ్ కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ కి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం వల్ల గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు.  అయినా గాయాలను పట్టించుకోలేదు పవన్‌.

మరో ఆపరేషన్ ఎప్పుడు? ప్రస్తుతం ఎలా ఉన్నారు?

ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. పవన్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో పవన్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ, రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా పవన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వేచి చూడండి. తాజా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.