
📌 Key Points
- పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటనతో ఫ్యాన్స్ సంబరాలు.
- మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
- హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ మొదలుకానుంది.
- ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు, నిర్మాత రామ్ తాళ్లూరి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగే.
మార్చి నుండి పవన్-సురేందర్ రెడ్డి మూవీ షూటింగ్ ప్రారంభం!
Pawan- Surender Reddy: ఓజీ సినిమాతో రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటుంన్నారో అలాగే చూపించి అదిరిపోయే హిట్ అందుకున్నాడు సుజీత్. ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఈ మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉందని టాక్. అయితే, ఇదే పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అని చాలా మంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్(Pawan- Surender Reddy). ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు.
హైదరాబాద్‌లో భారీ సెట్: షూటింగ్ అక్కడ నుండే మొదలు!
ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచినప్పటినుంచి ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు పవన్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. మర్చి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. మొదట హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది అని సమాచారం. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ న్యూస్ తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్!
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వస్తే, ఏజెంట్ సినిమా డిజాస్టర్ తరువాత మరో సినిమా చేయలేదు ఈ దర్శకుడు. అందుకే, చాలా కాలంగా ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కథపై వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు కథ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో దానికి పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర పడటంతో ఇప్పుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి ఈసారైనా హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.
పవన్ కళ్యాణ్ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


