|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ మూవీ: ఫౌజీ బ్యూటీ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 07-02-2026, 3:15 AM
పవన్ కళ్యాణ్ మూవీ: ఫౌజీ బ్యూటీ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబో మూవీపై భారీ అంచనాలు!
  • ప్రభాస్ ‘ఫౌజీ’లో నటిస్తున్న ఇమ్మాన్వి ఇస్మైల్‌ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్న మేకర్స్.
  • మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం, ఈ సంవత్సరం చివరిలో విడుదల లక్ష్యం!
  • పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెంటిమెంట్ రిపీట్: టైటిల్ రెండు అక్షరాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ మూవీ అప్‌డేట్స్!

Pawan Kalyan : సురేందర్‌ దర్శకత్వంలో పవన్‌ చేయబోయే మూవీపై అప్పుడే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవుతోంది. తన మార్క్ టేకింగ్.. హిట్ కంటెంట్‌తో రావాల‌ని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాడు సురేందర్‌రెడ్డి. రాక‌రాక ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా తీసేందుకు వ‌చ్చిన అవ‌కాశంతో గ్రాండ్‌గా కమ్‌ బ్యాక్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రాజెక్ట్ అపిషీయల్‌గా ప్రకటించగా కాస్ట్ అంట్ క్రూ కోసం బానే సెర్చ్ చేస్తున్నారట. అయితే ప‌వ‌న్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. ఫౌజీ బ్యూటీ ఇమ్మాన్వి ఇస్మైల్‌ని తీసుకుంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారట.

ఫౌజీ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు జంటగా నటిస్తున్న ఇమ్మాన్వి ఇస్మైల్‌ను ఆల్‌మోస్ట్‌ హీరోయిన్‌గా లాక్ చేశారని టాక్ నడుస్తుంది. పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఇమ్మాన్వి ఇస్మైల్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆమె బెస్ట్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు ఫౌజీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

ఫౌజీ బ్యూటీ ఇమ్మాన్వి ఇస్మైల్‌తో పవన్ జోడీ?

ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్‌తో జోడి కట్టే అవకాశం ఉందట. ఇది నిజమా లేక జస్ట్ రూమర్స్ అనేది తెలియాలంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో పవన్ చేయబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతోందట. ఇది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

మార్చి నుండి షూటింగ్, టైటిల్ ఫిక్సయిందా?

ఇక టైటిల్ కూడా రెండు అక్షరాలు మాత్రమే ఉంటుందనే టాక్ నడుస్తుంది. పవన్ ఓజీకి రెండు అక్షరాలే. ఈ సారి కూడ ఇదే సెంటిమెంట్‌తో పాటు మాస్ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారట. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళి..ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.