|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌కు డేట్స్ ఫిక్స్ చేసిన పవర్ స్టార్!

Published: 03-03-2026, 3:05 AM
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌కు డేట్స్ ఫిక్స్ చేసిన పవర్ స్టార్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌కు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయింపు!
  • మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల, ప్రమోషన్స్‌లో పవన్ సందడి!
  • ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటరాక్షన్‌లో పవన్ కళ్యాణ్!
  • OG ప్రమోషన్స్ తరహాలోనే ఉస్తాద్ ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ లుక్స్‌పై అభిమానుల ఆసక్తి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్‌తో మళ్ళీ సందడి చేయడానికి సిద్ధమయ్యారు. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, సినిమా కోసం సమయం కేటాయించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా షూటింగ్ కి డేట్స్ ఇవ్వడమే కష్టం అలాంటిది ప్రమోషన్స్ కి అసలు ఛాన్స్ లేదు. కానీ హరిహర వీరమల్లు సినిమాకు గట్టిగానే ప్రమోషన్స్ చేసారు నిర్మాత కోసం. OG సినిమాకు కూడా రెండు రోజులు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 రిలీజ్ కానుంది. ప్రభుత్వ కార్యక్రమాలతో బిజిగా ఉన్న పవన్ ప్రమోషన్స్ కి వస్తారా లేదా అనేది అందరికి సందేహమే. తాజాగా దీనికి సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తుంది.

మార్చి 26న విడుదల.. ప్రమోషన్స్‌లో పవన్ సందడి!

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కి రెండు రోజులు సమయం కేటాయించారట. ఈ రెండు రోజులలో ఒక రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. మరో రోజు పవన్ తో ఏదైనా కొత్తగా ప్రమోషన్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట హరీష్ శంకర్. అలాగే ఈ రెండు రోజుల్లోనే మీడియాతో ఇంటరాక్షన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తుంది.

OG తరహాలో ఉస్తాద్ ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్!

OG ప్రమోషన్స్ లో పవన్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరుకి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ ఇప్పుడు ఉస్తాడా భగత్ సింగ్ ప్రమోషన్స్ కి వస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉస్తాద్ ప్రమోషన్స్ లో పవన్ ఎలాంటి లుక్స్ లో కనిపిస్తారో అని ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో ఎలా సందడి చేస్తారో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.