|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలపై మెగా క్లారిటీ.. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న న్యూ ఇయర్ పోస్టర్!

Published: 01-01-2026, 10:30 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలపై మెగా క్లారిటీ.. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న న్యూ ఇయర్ పోస్టర్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ 2026 సమ్మర్ లో విడుదల కావడం ఖాయం.
  • న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్.
  • ఒక చేతిలో గన్, మరో చేతిలో రేడియోతో పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు.
  • మార్చి 27 విడుదల వార్తలు కేవలం పుకార్లే అని తేలింది.

కొత్త సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది. న్యూ ఇయర్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి. పూర్తి వివరాలు కథనంలో.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీపై స్పష్టత

Ustaad Bhagat Singh: 2025 వ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ.. 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ వెల్లడించారు. కొత్త సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా నుంచి నిర్మాతలు మరొక అప్డేట్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేస్తూ.. సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఒక చేతిలో గన్ మరో చేతిలో రేడియో పట్టుకొని సూపర్ లుక్ లో కనిపించిన నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర బృందం.. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడమే కాకుండా ఈ ఏడాది అందరికీ సక్సెస్ రావాలని కోరుకున్నారు. అలాగే ఈ ఏడాది మీకు ఏదైనా చాలెంజ్ విసిరితే “దేఖల్లేంగే సాల.. చూసినం లే చాలా” అని చెప్పండి అంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమాని 2026 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. 2026 ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అయితే మార్చిలోనే విడుదల కాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. మార్చ్ 27వ తేదీ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా వాయిదా పడితే ఆ స్థానంలోకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ పెద్ద సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ 2026 సమ్మర్ లోనే విడుదల కాబోతుందని తెలిపారు.

న్యూ ఇయర్ పోస్టర్ ప్రత్యేకతలు

Wishing you all a very Happy New Year ❤‍🔥

May your year be filled with joy and success ✨

And remember, if there is any challenge life throws at you this year, just say…’Dekhlenge Saala, chusinam le chaala’ 💥 #UstaadBhagatSingh – A Cult Captain @harish2you ‘s Feast 🔥… pic.twitter.com/UzEKypWePy

వేసవిలో పవన్ కళ్యాణ్ ధూమ్ ధామ్

— Ustaad Bhagat Singh (@UBSTheFilm) January 1, 2026

ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్లుగా శ్రీలలతో పాటు రాశి కన్నా నటించి సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేఖల్లేంగే సాల.. చూసినం లే చాలా అంటూ సాగిపోయే పాటను విడుదల చేయగా, ఈ పాటకు భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 సమ్మర్‌కు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ విభిన్నమైన లుక్‌తో కూడిన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను రేపుతోంది. ఈ వేసవిలో పవన్ మానియా థియేటర్లను షేక్ చేయడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.