
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దీపావళి అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే, నిర్మాత నవీన్ ఎర్నేని దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీపావళికి అప్డేట్ లేదని, త్వరలో అద్భుతమైన టీజర్లు, పాటలు విడుదల చేస్తామని తెలిపారు.
Key Points
దీపావళికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్ ఉండదని నిర్మాత నవీన్ ఎర్నేని స్పష్టం చేశారు.
త్వరలోనే పాటలు, టీజర్లు విడుదల చేస్తామని నిర్మాత హామీ ఇచ్చారు.
పవన్ సరసన శ్రీలీల, కీలక పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అప్డేట్‌పై నిర్మాత నవీన్ ఎర్నేని స్పందన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh Movie). దీనిని హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. దీపావళికి ఉస్తాద్ నుంచి అప్డేట్ కావాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. దీనిపై నిర్మాత నవీన్ ఎర్నేని స్పందించారు. ‘దీపావళికి ఉస్తాద్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. కానీ త్వరలోనే ఆ చిత్రం నుంచి చాలా అద్భుతమైన అప్డేట్స్ ఇస్తాం. సాంగ్స్, టీజర్స్ విడుదల చేస్తాం. హరీశ్ శంకర్ చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది’ అని నవీన్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్‌లో నటిస్తుండగా.. రాశీఖన్నాకీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీడియో
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీలక నటీనటులు
పవన్ ‘ఉస్తాద్’ విడుదల ఎప్పుడు?
మొత్తం మీద, దీపావళికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ లేకపోయినా, రాబోయే రోజుల్లో పవన్ అభిమానులకు పండగే అని నిర్మాత హామీ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో భారీ అంచనాలతో విడుదల కానుంది.


