|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎట్టకేలకు కొడుకు పేరును రివీల్ చేసిన పవన్ భార్య.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

Published: 14-11-2025, 10:46 PM
ఎట్టకేలకు కొడుకు పేరును రివీల్ చేసిన పవన్ భార్య.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

నటి అంజలి పవన్, భర్త పవన్ తమ రెండో బిడ్డ పుట్టుకను, పేరును చిల్డ్రన్స్ డే సందర్భంగా వెల్లడించారు. తమకు కుమారుడు జన్మించాడని, అతని పేరు జై వీర్ క్రితిక్ (JVK) అని తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

నటి అంజలి పవన్, భర్త పవన్ తమ రెండో బిడ్డ కుమారుడని ప్రకటించారు.

2

చిల్డ్రన్స్ డే సందర్భంగా కుమారుడి పేరు జై వీర్ క్రితిక్ (JVK) అని వెల్లడించారు.

4

పాప ధన్య శ్రీ (చందమామ) తన తమ్ముడి గురించి చెప్పిన డైలాగ్ వీడియోకు హైలెట్‌గా నిలిచింది.

అంజలి పవన్ కుటుంబం: బిడ్డ జెండర్ రివీల్

బుల్లితెర నటి అంజలి పవన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది కెరీర్ స్టార్టింగ్‌లో మొగలిరేకులు, దేవత లాంటి సీరయల్‌లో నటించి మెప్పించింది. ఆ తర్వాత యాంకర్‌గా పలు టీవీ షోలు కూడా చేసింది. ఇక యాక్టర్ పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంటకు ధన్య శ్రీ(చందమామ) అనే పాప ఉండగా ఇటీవలే తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ జంట ఇప్పటివరకు తమకు ఎవరు పుట్టారో(జెండర్ రివీల్) చెప్పలేదు. దీంతో ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఆమె ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా అంజలి ఫ్యామిలీ తమకు ఎవరు పుట్టారో చెప్పేశారు. ఇందులో భాగంగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. అందులో ఫైనల్‌గా మాకు ప్రిన్స్ పుట్టాడు.. అతని పేరు ఏంటంటే అని గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో షేర్ చేస్తూ జెవికె(జై వీర్ క్రితిక్) అని అనౌన్స్ చేశారు. ఇక ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. అయితే చివరగా చందమామ నా తమ్ముడు జైవీర్ క్రితిక్ అర్థమైందా అని చెప్పే డైలాగ్ వీడియో మొత్తానికే హైలెట్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. కంగ్రాట్స్‌తో పాటు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేసేయండి.

జై వీర్ క్రితిక్: పేరు వెల్లడి, వైరల్ వీడియో

చందమామ హైలైట్ డైలాగ్

అంజలి పవన్ దంపతులు తమ కుమారుడి పేరును వెల్లడించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. జై వీర్ క్రితిక్ పేరుతో పాటు, చందమామ డైలాగ్ వీడియోకు మరింత ప్రత్యేకతను తెచ్చింది. ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.