
📌 Key Points
- పేటీఎం యూజర్ల కోసం కొత్త పేమెంట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
- పేమెంట్ చేసే ముందు ఎంత చెల్లిస్తున్నారో తెలుసుకోవచ్చు.
- రిటైల్ లావాదేవీల కోసం ఈ కాలిక్యులేటర్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
- పేమెంట్ సమయంలో ఆటోమేటిక్‌గా కాలిక్యులేటర్ యాక్టివేట్ అవుతుంది.
పేటీఎం యూజర్లకు ఒక శుభవార్త! పేమెంట్ చేసేటప్పుడు ఎంత మొత్తం చెల్లిస్తున్నారో తెలుసుకోవడానికి పేటీఎం కొత్తగా కాలిక్యులేటర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఇకపై సులభంగా లెక్కలు వేసుకోవచ్చు.
పేటీఎంలో కొత్త కాలిక్యులేటర్ ఫీచర్
Paytm Calculator : పేటీఎంలో కొత్త పేమెంట్ కాలిక్యులేటర్ ఫీచర్ చూశారా? మీరు పేమెంట్ చేసే సమయంలో ఎంత కడుతున్నారో మొత్తం అమౌంట్ చెక్ చేయొచ్చు.. ఎలాగంటే?
Paytm Calculator : పీటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం కొత్త పేమెంట్ ఫీచర్ వచ్చేసింది. పేటీఎం పేమెంట్ స్క్రీన్‌లో ఇంటర్నల్ కాలిక్యులేటర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై పేటీఎం వినియోగదారులు పేమెంట్ పూర్తి చేసే ముందు ఎంత చెల్లించనున్నారో ముందుగానే పూర్తి లెక్కలతో తెలుసుకోవచ్చు.
ఇకపై మీరు ఏ పేమెంట్ చేసినా ఆ పేమెంట్ మొత్తం ముందుగానే కౌంట్ చేసుకోవచ్చు. కొత్త పేమెంట్ స్క్రీన్‌లో ఎంత అమౌంట్ యాడ్ చేస్తారో చేసి ఆ లావాదేవీని పూర్తి చేయొచ్చు. రిటైల్ లావాదేవీల కోసం ఈ కాలిక్యులేటర్ ఫీచర్ వాడుకోవచ్చు.
కాలిక్యులేటర్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
Read Also : Fake Tax Notices : ఐటీ శాఖ హెచ్చరిక.. మీకూ Tax నోటీసులు వచ్చాయా? ఇది పక్కా స్కామర్ల పనే.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు!
ఈ ఫీచర్ పేటీఎంలో ఏదైనా పేమెంట్ చేసే సమయంలో ఆటో యాక్టివేట్ అవుతుంది. యాప్‌లోనే డైరెక్ట్ పేమెంట్ చేస్తే ఫైనల్ అమౌంట్ ఎంత అనేది అక్కడ కనిపిస్తుంది. దీనికోసం మీరు ప్రత్యేకించి స్పెషల్ కాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. పేటీఎంలోనే ఇన్ బిల్ట్ కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది అనమాట.
ఈ ఫీచర్ ఎవరికి ఉపయోగపడుతుంది?
కంపెనీ ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు, ఫార్మసీలు, లోకల్ షాపుల్లో పేమెంట్లు వంటి రోజువారీ రిటైల్ లావాదేవీల కోసం తీసుకొచ్చింది. ఇందులో వ్యక్తిగత వస్తువుల ధరలు తరచుగా పేమెంట్ చేసే ముందు కనిపిస్తాయి. మీ నెలవారీ బిల్లులు లేదా సర్వీసుల మొత్తాలను లెక్కించేందుకు ఈ పేటీఎం కాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు.
ఈ కాలిక్యులేటర్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే? : పేటీఎం యాప్‌లో ఇంటర్నల్ కాలిక్యులేటర్ యాడ్ అయింది :
పేటీఎం తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేమెంట్ చేసే ముందు మొత్తం ఎంత చెల్లిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.


