|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్దిలో చరణ్ ఎత్తి విసిరేసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా? శిబిన్ రాఘవ్ మాస్ ఎంట్రీ!

Published: 05-06-2026, 4:45 PM
పెద్దిలో చరణ్ ఎత్తి విసిరేసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా? శిబిన్ రాఘవ్ మాస్ ఎంట్రీ!
  • ‘పెద్ది’లో చరణ్ ఎత్తి విసిరేసిన ఆంబ్రోస్ పాత్రధారి శిబిన్ రాఘవ్ నటనకు అద్భుత ప్రశంసలు.
  • కేరళ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి, మలయాళంలో గుర్తింపు తెచ్చుకున్న శిబిన్ రాఘవ్ తెలుగు ఎంట్రీ.
  • సినిమా విడుదల తర్వాత బుచ్చిబాబు, రామ్ చరణ్ అభిమానులకు శిబిన్ రాఘవ్ ప్రత్యేక కృతజ్ఞతలు.
  • ‘పెద్ది’ చిత్రంతో శిబిన్ రాఘవ్ కు టాలీవుడ్ లో మరిన్ని భారీ అవకాశాలు ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

‘పెద్ది’ సినిమాతో టాలీవుడ్ లోకి మాస్ ఎంట్రీ ఇచ్చి, కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న యువ నటుడు శిబిన్ రాఘవ్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. రామ్ చరణ్ పక్కన ఆంబ్రోస్ గా మెరిసిన ఈ నటుడి అసలు కథ ఏంటి? తెలుసుకుందామా!

‘పెద్ది’లో శిబిన్ రాఘవ్ మాస్ పర్ఫార్మెన్స్

Shibin Raghav : రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ క్రికెటర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. సినిమాలో రెండు సార్లు క్రికెట్ మ్యాచ్ లు ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ లో చాలా మంది నటులు క్రికెటర్స్ గా కనపడ్డారు. అందులో తలారి ఆంబ్రోస్ అనే పాత్రలో ఈ నటుడు బాగా వైరల్ అయ్యాడు.

ఈ ఆంబ్రోస్ పాత్ర చేసిన నటుడి పేరు శిబిన్ రాఘవ్. పెద్ది సినిమాలో క్రికెట్ మ్యాచుల్లో ఫాస్ట్ బౌలర్ పాత్రలో ఇతను కనిపించాడు. ఇతని బౌలింగ్ సీక్వెన్స్ లు, ఇతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఓ మ్యాచ్ లో ఇతన్ని రామ్ చరణ్ ఎత్తి అవతలకు విసిరేస్తాడు. ఆ సీన్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. అలా క్రికెట్ మ్యాచ్ లో పలుమార్లు కనపడి శిబిన్ రాఘవ్ ఇప్పుడు వైరల్ అయ్యాడు. తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు.

చరణ్ తో వైరల్ అయిన ఆంబ్రోస్ సీన్

శిబిన్ రాఘవ్ మలయాళీ నటుడు. కేరళలో మోడల్ గా చేసేవాడు. పలు మలయాళం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు. లోక చాప్టర్ 1 సినిమాతో శిబిన్ రాఘవ్ కు మలయాళంలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగులో పెద్ది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తర్వాత శిబిన్ రాఘవ్ కు అభినందనలు వస్తుండటంతో బుచ్చిబాబు తో దిగిన ఫోటోని, సినిమా షూట్ గ్యాప్ లో దిగిన పలు ఫొటోలను షేర్ చేసి తెలుగు ఆడియన్స్ కి, బుచ్చిబాబుకి, చరణ్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపాడు.

తెలుగులో శిబిన్ రాఘవ్ భవిష్యత్తు

ఇతని పర్ఫార్మెన్స్ చుసిన తర్వాత తెలుగులో శిబిన్ రాఘవ్ కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అని తెలుస్తుంది.

శిబిన్ రాఘవ్ పర్ఫార్మెన్స్ తో ‘పెద్ది’ సినిమాలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతని అద్భుత నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్ లో ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తూ, మరిన్ని తాజా సినిమా అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.