
📌 Key Points
- ‘పెద్ది’ ఫస్ట్ ప్రెస్ మీట్ నేడు! భారీ అంచనాలతో మెగా ఈవెంట్ షురూ.
- రామ్ చరణ్ హాజరుపై తీవ్ర ఉత్కంఠ. ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూపులు.
- బుచ్చిబాబు, మైత్రి నిర్మాతలు, రెహమాన్ రాక ఖాయం! సంచలన ప్రకటనలు.
- జాన్వీ కపూర్ ఈవెంట్ కు దూరం. కొత్త అప్డేట్స్ కోసం సర్వత్రా ఆసక్తి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! నేడు ‘పెద్ది’ ఫస్ట్ ప్రెస్ మీట్ తో అప్డేట్స్ సునామీ రాబోతోంది. సిద్ధంగా ఉండండి!
పెద్ది రిలీజ్ డేట్ పై క్లారిటీ!
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఈ సినిమాపై హైప్ పెంచుకుంటున్నారు. అయితే అనుకున్న డేట్ కి రాక పెద్ది సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. ఇటీవల బుచ్చిబాబు ఓ సినిమా ఈవెంట్లో పెద్ది సినిమా జూన్ 25 వస్తుందని ప్రకటించారు.
దీంతో ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పెద్ది సినిమా నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈ సినిమా హైప్ కి ప్రమోషన్స్ అవసర్లేకపోయినా కనీసం మినిమమ్ ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సినిమా సెట్స్ నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు, పలు వర్కింగ్ స్టిల్స్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో బయట ఎక్కడా కూడా కనిపించలేదు. మెగా ఫ్యాన్స్ పెద్ది నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తారా?
అందుకే రిలీజ్ డేట్ క్లారిటీ కోసం, సినిమా అప్డేట్స్ ఇవ్వడం కోసం నేడు పెద్ది ప్రెస్ మీట్ పెడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ ప్రెస్ మీట్ నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, ఈ సినిమాని సమర్పిస్తున్న మైత్రి అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సాన హాజరు కాబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా వస్తారని టాక్ ఉంది.
జాన్వీ కపూర్ ఎంట్రీ డౌటేనా?
అయితే ఈ ప్రెస్ మీట్ కి రామ్ చరణ్ వస్తారా లేదా అనేది సందేహమే. ఫ్యాన్స్ అయితే చరణ్ వస్తే బాగుండు, బయట కనిపించి చాలా రోజులు అవుతుందని ఎదురుచూస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ అయితే ఈ ప్రెస్ మీట్ కి వచ్చే అవకాశమే లేదు అని తెలుస్తుంది. మరి నేడు పెద్ది ప్రెస్ మీట్ లో మేకర్స్ ఏం చెప్తారో చూడాలి.
మొత్తానికి ‘పెద్ది’ ప్రెస్ మీట్ తో అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. చరణ్ రాక, రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


