|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పెద్ది’ నుంచి రామ్‌బుజ్జి పోస్టర్ రిలీజ్.. మాస్ అండ్ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ యాక్టర్

Published: 19-06-2025, 3:15 AM
‘పెద్ది’ నుంచి రామ్‌బుజ్జి పోస్టర్ రిలీజ్.. మాస్ అండ్ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ యాక్టర్

రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి తాజా అప్డేట్ వచ్చింది. దివ్యేందు శర్మ పుట్టినరోజు సందర్భంగా ‘రామ్ బుజ్జి’ గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మాస్ లుక్‌లో ఆకట్టుకున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Key Points

1

‘పెద్ది’ సినిమా నుండి దివ్యేందు శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్

2

రామ్ బుజ్జి పాత్రలో దివ్యేందు శర్మ మాస్ లుక్

4

సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ అవుతోంది

దివ్యేందు శర్మ ఫస్ట్ లుక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(RAM CHARAN), బుచ్చిబాబు సనా(BUCHIBABU SANA) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’(Peddi). దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్(Shivaraj Kumar), జగపతి బాబు(Jagapathi Babu), దివ్యేందు శర్మ(Divyendu Sharma)లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘రామ్ బుజ్జి’ పాత్ర విశేషాలు

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు స్టార్ యాక్టర్ దివ్యేందు శర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అతని ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. ‘పెద్ది బృందం తమ ‘రామ్‌బుజ్జి'(Rambujji) అకా అత్యున్నత ప్రతిభావంతుడైన divyenduకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది.. ‘రామ్‌బుజ్జి’ అనేది పెద్ది యొక్క ముడి & గ్రామీణ ప్రపంచం నుండి అత్యంత ఆసక్తికరమైన పాత్రలలో ఒకటిగా ఉంటుంది.

సినిమా విడుదల తేదీ

ఈ సినిమా మార్చి 27, 2026న గ్లోబల్ విడుదల కానుంది’ అని రాసుకొస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో దివ్యేందు గుబురు జుట్టు, రగ్గడ్ గడ్డంతో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. కుడి చేతి చూపుడు వేలుకు బ్యాండేజ్ పెట్టుకొని ఉన్నాడు. అలాగే ఎడమ చేతికి వాచ్ పెట్టుకుని మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మరింత హైప్ పెంచేసింది.

దివ్యేందు శర్మ రామ్ బుజ్జిగా కనిపించే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 27, 2026న విడుదల కానున్న ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.