|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది రిలీజ్‌పై దెబ్బ‌కు దిమ్మ‌తిరిగే ట్విస్ట్! చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఎస్కేఎన్!!

Published: 31-03-2026, 4:05 AM
పెద్ది రిలీజ్‌పై దెబ్బ‌కు దిమ్మ‌తిరిగే ట్విస్ట్! చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఎస్కేఎన్!!
  • రామ్ చ‌ర‌ణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్‌పై ఎస్కేఎన్ కామెంట్స్ వైర‌ల్!
  • ఏప్రిల్‌లో ‘పెద్ది’ రానుందా? క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసిన నిర్మాత ఎస్కేఎన్.
  • జూన్ 26న ‘చెన్నై ల‌వ్ స్టోరీ’ రిలీజ్ అనుకున్నాం: ఎస్కేఎన్
  • ‘పెద్ది’ రిలీజ్‌పై పొర‌పాటున మాట్లాడాను, సారీ చెప్పిన ఎస్కేఎన్!

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్! ‘పెద్ది’ మూవీ రిలీజ్‌పై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా?

ఎస్కేఎన్ కామెంట్స్‌తో క్రియేట్ అయిన క‌న్ఫ్యూజ‌న్

PEDDI: ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కామెంట్లు పెద్ద రచ్చకే తెరదీశాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సినిమా ఏప్రిల్ లోనే వస్తుందా? రాదా? అన్నది ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.

ఉన్నట్లుండి ఒక్కసారిగా పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు తెగ డిస్కషన్ పాయింట్ గా మారింది. ఇదే విషయం వైరల్ అవుతుంది. అసలు పెద్ది రిలీజ్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీనంతటికి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన కామెంట్లే కారణం.

ఏప్రిల్‌లోనే ‘పెద్ది’ రిలీజ్ అవుతుందా?

‘‘జూన్ 26న చెన్నై లవ్ స్టోరీ మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ అదే తేదీన పెద్ది విడుదల ఉందని సాయి రాజేశ్ చెప్పారు. అందుకే మా మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాం’’ అని ఎస్కేఎన్ అన్నాడు.

సారీ చెప్పిన ఎస్కేఎన్.. అస‌లేం జ‌రిగిందంటే?

అయితే దీనిపై మళ్లీ క్లారిటీ ఇస్తూ ఎస్కేఎన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏదో పొరపాటున పెద్ది రిలీజ్ డేట్ గురించి మాట్లాడానని, ఆ మూవీ విడుదల వాయిదా అనేందుకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నాడు. తన కామెంట్లకు గాను సారీ కూడా చెప్పాడు.

ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్ గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.