|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్! ‘చికిరి’ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉందా?

Published: 13-01-2026, 5:00 AM
రామ్ చరణ్ 'పెద్ది' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్! 'చికిరి' రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉందా?
  • రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్ లో ‘పెద్ది’ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.
  • ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
  • ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు, ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట ట్రెండింగ్ లో ఉంది.
  • త్వరలో ఈ సినిమా నుంచి రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో ఈ సినిమా నుంచి రెండవ పాటను విడుదల చేయనున్నారు.

మార్చి 27న ‘పెద్ది’ విడుదల

Peddi Update:గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ (Ram Charan) తాజాగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న బుచ్చిబాబు సన.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు మార్చి 27వ తేదీన రాబోతోంది. పైగా ఇదే రోజు రామ్ చరణ్ పుట్టినరోజు కూడా కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. పైగా ఈ సినిమాలో ప్రముఖ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఏ. ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇకపోతే సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పైగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నాడు. దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్ లకు అదిరిపోయేలా రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన “చికిరి చికిరి” సాంగ్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘చికిరి చికిరి’ సాంగ్

అందులో భాగంగానే హైదరాబాదు వేదికగా భారీ సెట్ వేసి ప్రధాన పాత్రలపై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇక పెద్ది సినిమా ఫస్ట్ హాఫ్ కట్ సిద్ధమైందని సమాచారం . ఇక ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయట. అనుకున్న తేదీకి అనుకున్నట్టుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం పక్కాగా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా త్వరలో ఈ సినిమా నుంచి రెండవ పాటను కూడా విడుదల చేయనున్నారు.

నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఎందుకో వెనుకడుగు వేశారు. అటు ఈ సంక్రాంతికైనా రెండో పాటను రిలీజ్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేయాలనుకుంది చిత్రబృందం. కానీ అది కూడా జరగలేదు. అందుకే ఎలాగైనా సరే మరికొన్ని వారాలలో ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రెండవ పాట చికిరి సాంగ్ ను బీట్ చేస్తుందేమో చూడాలి. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దివ్యేందు శర్మ, జగపతిబాబు, వీజీ చంద్రశేఖర్, సత్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

త్వరలో విడుదల కానున్న రెండవ పాట

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే రెండవ పాట విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.