|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Peddi: ‘పెద్ది’ చిత్రీకరణపై బిగ్గెస్ట్ అప్డేట్.. నేడు హైదరాబాద్‌లో షూట్ కాగా.. తర్వాత ఎక్కడంటే?

Published: 30-06-2025, 11:54 AM
Peddi: ‘పెద్ది’ చిత్రీకరణపై బిగ్గెస్ట్ అప్డేట్.. నేడు హైదరాబాద్‌లో షూట్ కాగా.. తర్వాత ఎక్కడంటే?

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభమైంది. ఈ సినిమా చిత్రీకరణ తర్వాత ఢిల్లీలో జరుగనుందని సమాచారం. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Key Points

1

‘పెద్ది’ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

2

తర్వాత షూటింగ్ ఢిల్లీలో జరుగనుంది.

4

సినిమా 2024 మార్చి 27న విడుదల కానుంది.

‘పెద్ది’ చిత్రీకరణ ప్రారంభం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchibabu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

దీంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా సినిమా చిత్రీకరణకు సంబంధించి లేటెస్ట్ బజ్ నెట్టింట షికార్లు చేస్తుంది. ఈ మేరకు వైరల్ అవుతున్న న్యూస్ మేరకు.. ‘పెద్ది షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత.. రామ్‌చరణ్ బృందం ఢిల్లీకి బయలుదేరుతుంది. అక్కడ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబడతాయి’ అని తెలుస్తుండగా.. జూలై 12 నుండి జాన్వీ కపూర్ షూట్‌లో చేరనున్నట్లు టాక్. లింక్

ఢిల్లీ షెడ్యూల్ వివరాలు

జాన్వీ కపూర్ ప్రవేశం

‘పెద్ది’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ తర్వాత ఢిల్లీలో కొనసాగుతుంది. జాన్వీ కపూర్ జూలైలో చేరనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 2024 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.