
📌 Key Points
- రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
- ఈ సినిమా రన్ టైమ్ నాలుగు గంటలు ఉంటుందనే వార్తల్లో నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది.
- ప్రస్తుతం సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తయిందని, సెకండ్ హాఫ్ షూటింగ్ జరుగుతోందని తెలిపారు.
- రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. సినిమా రన్ టైం గురించి వస్తున్న పుకార్లపై చిత్ర బృందం స్పందించింది.
‘పెద్ది’ మూవీ విడుదల ఎప్పుడు?
Peddi film: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan )హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు డబ్బింగ్ పనులు జరుపుతూనే మరోవైపు షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ రై రై రారా అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.
ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రామ్ చరణ్ అద్భుతమైన స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా రన్ టైం దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . ఈ సినిమా నాలుగు గంటల షూటింగ్ పూర్తి చేశారని అయితే ఈ సినిమా రన్ టైం 3 గంటలకు కుదిస్తూ విడుదల చేయబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించారు. పెద్ది సినిమా రన్ టైం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
సినిమా రన్ టైంపై వస్తున్న పుకార్లు
ఈ సినిమా ఇప్పటివరకు కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే ఫైనల్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోందని, ఏప్రిల్ 30వ తేదీ నాటికి అన్ని పనులను పూర్తి చేసుకొని మీకు చెప్పిన విధంగానే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము అంటూ చిత్ర బృందం పెద్ది సినిమా రన్ టైం గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ, క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా రన్ టైం మూడు గంటల నిడివి అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టి సినిమా చూపించడం అంటే దర్శకుడికి కత్తి మీద సామూలాంటిదే అని చెప్పాలి.
చిత్ర బృందం స్పందన
ఇక ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ చాలా క్వాలిటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈయనకు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మార్చ్ 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
పెద్ది సినిమా రన్ టైం గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని చిత్ర బృందం కోరింది. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుండగా, మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.


