
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదల, జూన్ 3న రాత్రి నుంచే ప్రీమియర్స్. ధమాకా ఖాయం.
- నిర్మాత సతీష్ కిలారుకు చరణ్ ఇంటి భోజనం.. ఇది వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ కి నిదర్శనం.
- బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.
- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ‘పెద్ది’ చిత్రం ఒక మరపురాని ఎమోషనల్ రైడ్ గా నిలుస్తుంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పెద్ది’ మానియానే! రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ పై భారీ అప్డేట్ వచ్చేసింది. నిర్మాత వెంకట సతీష్ కిలారు చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
‘పెద్ది’ ప్రీమియర్స్ డేట్ ఫిక్స్!
Venkata Satish Kilaru : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో సినిమాపై హైప్ పెరిగింది. నేడు పెద్ది సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు, సుకుమార్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డీఓపీ రత్నవేలు.. పలువురు మూవీ టీమ్ హాజరయ్యారు.
ఈ ప్రెస్ మీట్ లో పెద్ది సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని జూన్ 4వ తేదీనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
చరణ్ తో భోజనం.. నిర్మాత ఎమోషనల్!
ఈ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట్ సతీష్ కిలారు మాట్లాడుతూ.. రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అసలు నేనేంటో కూడా తెలియకుండా రామ్ చరణ్ గారు మాకు ఫస్ట్ సినిమా ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. బుచ్చి బాబు ఈ సినిమాని చాలా బాగా చేసి పెట్టాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ మీద నేను హ్యాపీగా ఉన్నా. ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమా ఎమోషనల్ రైడ్. అందరూ చూడొచ్చు.
సినిమా అవుట్ పుట్ పై భారీ నమ్మకం!
షూటింగ్స్ లో రోజూ చరణ్ గారు ఆయన ఇంటి దగ్గర్నుంచి భోజనం తెప్పించి పెట్టేవారు నాకు. రోజూ మధ్యాహ్నం ఆయన దగ్గర కూర్చొని తినేవాడిని. నిన్నే లాస్ట్ డే షూట్. నిన్న కూడా కూర్చొని కలిసి తిన్నాము నేను, చరణ్. నేను డే 1 నుంచి ఇవాళ్టివరకు హ్యాపీగా ఉన్నా సినిమా మేకింగ్ లో. జూన్ 4న రిలీజ్ చేస్తున్నాం. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి అని అన్నారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


