
📌 Key Points
- ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ సీన్లపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పెద్ద వివాదం.
- దర్శకుడు బుచ్చిబాబు సాన వెంటనే స్పందించి, బహిరంగ క్షమాపణలు చెప్పి, మార్పులకు సిద్ధం.
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రెండు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డు.
- హీరోయిన్‌ను శృంగార వస్తువులా చూపించారన్న ఆరోపణలపై దర్శకుడి సంచలన వివరణ, నిర్ణయం.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ సినిమా గురించే చర్చ! బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రంపై ఊహించని వివాదం రాజుకుంది. జాన్వీ కపూర్ పాత్ర విషయంలో దర్శకుడు బుచ్చిబాబు సాన తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
జాన్వీ కపూర్ సీన్లపై పెరిగిన నిరసన!
Buchi Babu Sana On Removing Janhvi Kapoor Scenes Peddi: రామ్ చరణ్ పెద్దిలో జాన్వీ కపూర్‌ని శృంగార వస్తువులా చూపించిన విధానంపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దర్శకుడు బుచ్చిబాబు సాన అధికారికంగా క్షమాపణలులు ప్రకటించారు. ఆ వివాదాస్పద సీన్లను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.
Buchi Babu Sana On Removing Janhvi Kapoor Scenes Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.
హీరోయిన్లను గ్లామర్ కోసం వాడుకునే ఆట వస్తువు కింద చూస్తున్నారని నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో దర్శకుడు బుచ్చిబాబు సాన శనివారం (జూన్ 6) ఉదయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు.
బుచ్చిబాబు సాన సంచలన క్షమాపణ!
అంతేకాకుండా, సినిమాలో హీరో తన స్నేహితులతో మాట్లాడుతూ.. అచ్చియమ్మ అనుమతి లేకుండానే ఆమెను తాకాలని ఉందంటూ చెప్పే డైలాగులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక సీన్‌లో కరెంట్ పోయిన సమయంలో అచ్చియమ్మ నిరాకరిస్తున్నప్పటికీ, హీరో ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం వంటి అంశాలు థియేటర్లలో ప్రేక్షకులను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయి.
‘మెయిల్ గేజ్’ (పురుషుల దృక్పథం) తోనే ప్రతి సీన్‌ను షూట్ చేశారంటూ సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ తీవ్రమైన వ్యతిరేకతపై దర్శకుడు బుచ్చిబాబు సాన ఎక్స్ లో సుదీర్ఘమైన నోట్ రాస్తూ స్పందించారు.
“‘పెద్ది’ చిత్రంలోని కొన్ని సీన్లపై వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం. వెండితెరపైనా, నిజజీవితంలోనూ నాకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ సినిమాలోని ఏ భాగమైనా అలా అనిపించి ఉంటే, ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము” అని బుచ్చిబాబు పేర్కొన్నారు.
“పెద్ది”లో కీలక మార్పులు: ఏం తొలగిస్తారు?
“ప్రతి మహిళ గౌరవించబడాలి, విలువైనదిగా చూడబడాలి. అందుకే విమర్శలు వచ్చిన ఆయా సీన్లలో మార్పులు చేయాలని మేము నిర్ణయించాము. తమ అభిప్రాయాలను నిజాయితీగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని బుచ్చిబాబు తన లేఖలో ముగించారు.
కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 150 కోట్ల గ్రాస్ సాధించి, రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది పెద్ది. ఇప్పుడు వివాదాస్పద సీన్లను కత్తిరించడం లేదా మార్చడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
‘పెద్ది’ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


