
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మొదటి సాంగ్ ప్రోమో విడుదలైంది. ‘చికిరి’ అనే పదంతో మొదలైన ఈ పాటలో చరణ్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ ప్రోమో భారీ అంచనాలను మరింత పెంచింది.
Key Points
'పెద్ది' సినిమా నుండి మొదటి సాంగ్ ప్రోమో విడుదలైంది.
'చికిరి' అనేది అమ్మాయిని వర్ణించడానికి వాడే ఒక పదం అని వెల్లడైంది.
రామ్ చరణ్ స్టెప్స్ అదిరిపోయాయని, ఫ్యాన్స్ పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్నారు.
పూర్తి 'చికిరి' పాట నవంబర్ 7న, సినిమా 2026 మార్చ్ 27న విడుదల.
‘పెద్ది’ మొదటి సాంగ్ ప్రోమో వచ్చేసింది
Peddi Song : రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రా & రస్టిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి.(Peddi Song)
తాజాగా పెద్ది సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఇటీవల చికిరి.. చికిరి.. అంటూ ఆ పదాన్ని పెద్ది మూవీ యూనిట్ బాగా వైరల్ చేసింది. దీంతో అదేంటి అని అంతా వెతికేసారు. నేడు బుచ్చిబాబు – రెహమాన్ మాట్లాడుతూ చికిరి అనేది అమ్మాయిని వర్ణించడానికి వాడే ఒక పదం అని చెప్పి ఆ పదంతోనే పాటని చేసాం అంటూ, అది హీరో మొదటిసారి హీరోయిన్ ని చూసిన సందర్భంలో వస్తుందని చెప్పి చికిరి సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు.
‘చికిరి’ అనే పదానికి అర్థం ఇదే!
చరణ్ స్టెప్స్, సినిమా విడుదల వివరాలు
బుచ్చిబాబు – రెహమాన్ మాట్లాడుకుంటున్న వీడియోలోనే చివర్లో పాట ప్రోమో జత చేసారు. ఫుల్ సాంగ్ నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో చరణ్ స్టెప్ అదిరిపోయింది. దీంతో ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా 2026 మార్చ్ 27 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
‘చికిరి’ పాట ప్రోమోతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నవంబర్ 7న పూర్తి పాట, 2026 మార్చ్ 27న సినిమా విడుదల కానున్నాయి. చరణ్ స్టెప్స్ ఈ పాటను హైలైట్ చేశాయి.


