|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది టీమ్ నుండి మెగా ఫ్యాన్స్‌కు పండుగ.. రామ్ చరణ్ డబుల్ ట్రీట్‌కు రెడీ!

Updated: 05-01-2026, 11:56 AM
పెద్ది టీమ్ నుండి మెగా ఫ్యాన్స్‌కు పండుగ.. రామ్ చరణ్ డబుల్ ట్రీట్‌కు రెడీ!
  • ‘పెద్ది’ మూవీ మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల.
  • సంక్రాంతి ట్రీట్‌గా ‘పెద్ది’ చిత్రం నుండి రెండో పాట విడుదల ప్లాన్.
  • రామ్ చరణ్ 500 మంది గ్రూప్ డ్యాన్సర్లతో కలిసి మాస్ స్టెప్పులు.
  • ఈ పాటలో జాన్వీ కపూర్‌తో కలిసి చరణ్ డ్యాన్స్ చేయనున్నారు.

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి సంక్రాంతి కానుకగా రెండో పాట విడుదల కానుంది. పక్కా మాస్ స్టైల్‌లో రూపొందిన ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ స్టెప్పులు ఆకట్టుకోనున్నాయి.

పెద్ది: తారాగణం, సాంకేతిక నిపుణులు

టాలీవుడ్‌లో రాబోతున్న ప్రాజెక్టుల్లో ప్రస్తుతం క్రేజ్, మార్కెట్, అభిమానుల అంచనాలు అన్నీ కలిపి చూసుకుంటే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్ నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఇంట్రెస్ట్ నెలకొంటోంది. అలాంటి టైం లో రామ్ చరణ్ హీరోగా న‌టిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అంచనాలను మించి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ గా మరింత నమ్మకం తెచ్చుకున్న సనా బుచ్చిబాబు ఈ సినిమాకు కథ,స్కేల్,ఎమోషన్ అన్నింటినీ కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో భాగస్వాములుగా ఉండటం సినిమాకు మరింత బలం చేకూర్చింది. టెక్నికల్ టీమ్ కూడా భారీగానే ఉంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు.

చికిరి చికిరి సక్సెస్, సెకండ్ సింగిల్‌పై అంచనాలు

చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మార్చి 27న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పాట ‘చికిరి చికిరి’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగిల్ మీదే పడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సంక్రాంతి కానుకగా ఈ రెండో పాటను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట పూర్తిగా పక్కా మాస్ స్టైల్‌లో ఉంటుందని, రామ్ చరణ్ ఎనర్జీకి తగ్గట్టుగా భారీ రేంజ్ లో తీస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ పాట షూట్ పూర్తయిందని, ఇందులో చరణ్ దాదాపు 500 మంది గ్రూప్ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేయనున్నారని సమాచారం. అంతేకాదు ఈ సాంగ్‌లో జాన్వీ కపూర్‌తో కలిసి చరణ్ డ్యాన్స్ చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి ట్రీట్‌గా ‘పెద్ది’ రెండో పాట

మాస్ బీట్‌లతో పాటు ఎమోషనల్ షేడ్స్ కూడా ఉండేలా రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేశారని మ్యూజిక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చికిరి చికిరి’ సక్సెస్ తర్వాత ఈ సెకండ్ సాంగ్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చికిరి చికిరి’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిలీజ్ అయినా కొద్ది రోజుల్లోనే యూట్యూబ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన స్పందన దక్కింది. ఎనర్జిటిక్ బీట్‌లు, క్యాచీ ట్యూన్‌తో రెహమాన్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడని మ్యూజిక్ లవర్స్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ డ్యాన్స్, ఎనర్జీ అభిమానులను ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో రీల్స్, షార్ట్ వీడియోలు ట్రెండ్ అవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేవలం ఒక నెలలోనే తెలుగు వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటగా, ఐదు భాషల్లో విడుదలైన అన్ని వెర్షన్లను కలిపితే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ రెండో సింగిల్ ఎలాంటి రేంజ్‌లో హంగామా చేస్తుందోనన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది. ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడనుందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే వాయిదా లేనట్లేనని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

చికిరి చికిరి’ పాట సక్సెస్ తర్వాత ‘పెద్ది’ రెండో పాటపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సంక్రాంతి ట్రీట్‌గా రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి సందడి చేయనున్న ఈ మాస్ సాంగ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.