
కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన ‘పినాక’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. గణేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌లో ఆయన సమరయోధుడిగా కనిపిస్తున్నారు.
Key Points
గోల్డెన్ స్టార్ గణేష్ పుట్టినరోజు సందర్భంగా ‘పినాక’ సినిమా నుంచి పోస్టర్ విడుదల.
సమరయోధుడి గెటప్‌లో గణేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
నల్లటి దుస్తులు, చేతిలో కత్తితో గుర్రంపై వీరోచితంగా కనిపిస్తున్నారు.
టీజర్ తర్వాత ఈ పోస్టర్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
గోల్డెన్ స్టార్ గణేష్ పుట్టినరోజు వేడుకలు
కన్నడ స్టార్ హీరో, గోల్డెన్ స్టార్ గణేష్(Ganesh) నటిస్తున్న తాజా సినిమా ‘పినాక’(Pinaka). కొరియోగ్రాఫర్ బి.ధనంజయ(B. Dhanunjaya) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad), కృతి ప్రసాద్(Krithi Prasad) ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు విజుల్ ట్రీట్‌ను ఇచ్చింది. రుద్ర, క్షుద్ర పాత్రల్లో హీరో గణేష్ అవతారాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి.
‘పినాక’ సినిమా తాజా పోస్టర్
ఇక మునుపెన్నడూ ఎరుగని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా హీరోకు సంబంధించిన మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు స్పెషల్ విష్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో గుర్రంపై హీరో నల్లటి దుస్తులు ధరించి సమర యోధుడులా ఉన్నాడు. చేతిలో కత్తి పట్టుకుని సైడ్‌కి చూస్తున్నాడు. అతని బ్యాక్‌గ్రౌండ్‌లో శత్రు సైనికులు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
వీరోచితమైన లుక్
A post shared by @peoplemediafactory
గణేష్ అభిమానులకు ఈ పోస్టర్‌తో పెద్ద సర్‌ప్రైజ్. ‘పినాక’ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


