|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

PNB ఖాతాదారులకు షాక్! మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే?

Published: 06-04-2026, 9:05 PM
PNB ఖాతాదారులకు షాక్! మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే?
  • మూడు సంవత్సరాలుగా లావాదేవీలు లేని ఖాతాలు క్లోజ్
  • జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా మూసివేయాలని నిర్ణయం
  • ఖాతాదారులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచన
  • ఖాతా కొనసాగించాలంటే రెగ్యులర్ లావాదేవీలు చేయాలి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరపని మరియు జీరో బ్యాలెన్స్ కలిగిన ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఖాతాదారులలో ఆందోళన కలిగిస్తోంది.

PNB ఖాతాలపై తాజా ప్రకటన

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. మూడు సంవత్సరాలుగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరపని ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ల‌ను క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ నెల 16వ తేదీ నుంచి ట్రాన్సాక్షన్ జరగని ఖాతాలను క్లోజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఖాతాలు ఇనాక్టివ్ గా ఉండటం వల్ల మోసాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా వెల్లడించింది. ఒకవేళ వినియోగదారులు తమ అకౌంట్లు కొనసాగించాలని కుంటే ఈ నెల 15వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది. దాంతో పాటు మనీ ట్రాన్జక్షన్స్ కూడా రెగ్యులర్ గా చేయాలని కోరింది. లేకపోతే ఖాతాలు మాత్రం క్లోజ్ చేయడం పక్కా అని వెల్లడించింది.

ఖాతాలు ఎందుకు క్లోజ్ చేస్తారు?

ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

PNB ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తమ ఖాతాలను సక్రమంగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే మీ ఖాతా మూసివేయబడే అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.