
బిగ్‌బాస్ 9 తెలుగులో ఈ వారం ఫ్యామిలీ వీక్‌తో సందడి నెలకొంది. తనూజ చెల్లి పూజ హౌస్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూజ పెళ్లి గురించి తెలిసి తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనై, అక్కగా ఆశీర్వదించింది. ఈ దృశ్యం అందరినీ కదిలించింది.
Key Points
బిగ్‌బాస్ 9 తెలుగులో ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది.
కంటెస్టెంట్ తనూజ చెల్లి పూజ హౌస్‌లోకి ప్రవేశించింది.
పూజ పెళ్లి త్వరలో ఉందని తెలిసి తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
తనూజ తన చెల్లికి పసుపు, కుంకుమ పెట్టి, అక్కగా ఆశీర్వదించింది.
బిగ్‌బాస్‌లోకి తనూజ చెల్లి పూజ ఎంట్రీ
బిగ్‌బాస్ 9 తెలుగులో ఈ వారం మొత్తం సందడిగా కనిపించనుంది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎమోషన్స్‌తో పాటు సంతోష క్షణాలు కనిపిస్తాయి. సుమారు 70రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తుండటంతో అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఫస్ట్ ఎంట్రీ తనూజ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ టీమ్ ప్రోమో వదిలింది.
తనూజ చెల్లి పూజ బిగ్‌బాస్‌లోకి వచ్చింది. తనను చూడగానే ఒక్కసారిగా తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిరోజుల్లోనే తన పెళ్లి ఉందంటూ పూజను అందరికీ పరిచయం చేస్తుంది. తనూజ బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల పెళ్లికి వెళ్లడం కుదరదు. దీంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది. హౌస్‌లోనే పసుపు, కుంకుమతో పాటు బొట్టు పెట్టి ఆపై కొన్ని గాజులు, బట్టలు తన చెల్లి ఒడిలో పెడుతుంది. అక్కగా ఆశీర్వదించగా పూజ కూడా తనూజ కాళ్లకు నమష్కారం చేస్తుంది.
పూజ పెళ్లి వార్తతో భావోద్వేగానికి లోనైన తనూజ
అక్కగా పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించిన తనూజ
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. తనూజ, పూజల అనుబంధం, భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వారం హౌస్‌లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చూడవచ్చు.

