|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూజా హెగ్డే కెరీర్ ముగిసినట్టేనా? శ్రీను వైట్ల సినిమాతో మళ్లీ నిరూపించుకుంటుందా?

Published: 21-03-2026, 7:35 AM
పూజా హెగ్డే కెరీర్ ముగిసినట్టేనా? శ్రీను వైట్ల సినిమాతో మళ్లీ నిరూపించుకుంటుందా?
  • ప్రభాస్ ‘రాధే శ్యామ్’ తర్వాత పూజా హెగ్డే కెరీర్ డౌన్ అయింది.
  • శ్రీను వైట్ల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.
  • పూజా హెగ్డే, శ్రీను వైట్ల కాంబినేషన్ పై నెటిజన్ల సెటైర్లు.
  • శర్వానంద్ సినిమాతో పూజా హెగ్డే తన సత్తా చాటుతుందా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. వరుస ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ తో కలిసి సినిమా చేస్తుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

పూజా హెగ్డేకు అవకాశాలు ఎందుకు తగ్గాయి?

Pooja Hegde: టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏ హీరో సినిమా చూసినా పూజా హెగ్డేనే కనిపించేది. అగ్ర హీరోలందరి సరసన నటించి, టాలీవుడ్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఈ ముంబై భామకు ఇప్పుడు కనీసం ఒక చిన్న ప్రాజెక్ట్ దక్కడమే గగనమైపోయింది. ప్రభాస్‌తో చేసిన ‘రాధే శ్యామ్’ డిజాస్టర్ తర్వాత పూజా జాతకం తలకిందులైంది. ఆ ఒక్క సినిమాతో ఆగిపోకుండా, మెగాస్టార్‌తో చేసిన ‘ఆచార్య’, విజయ్‌తో చేసిన ‘బీస్ట్’ వరుసగా బాక్సాఫీస్ వద్ద బొమ్మ బోర్లా పడటంతో ఈమెకు టాలీవుడ్ మేకర్స్ ‘రెడ్ కార్డ్’ ఇచ్చేశారు. దాదాపు రెండేళ్లుగా తెలుగు తెరకు దూరమైన ఈ అమ్మడు, ఇప్పుడు ఒక ఫేడవుట్ డైరెక్టర్ చెంతకు చేరడం చర్చనీయాంశంగా మారింది.

చాలా గ్యాప్ తర్వాత పూజా హెగ్డేకు ఒక ఆఫర్ అయితే వచ్చింది కానీ, దాన్ని తెచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల పేరు వింటేనే బయ్యర్లు వణికిపోతున్నారు. ‘ఆగడు’ నుంచి నిన్నటి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వరకు వైట్ల ట్రాక్ రికార్డ్ అంతా డిజాస్టర్ల మయమే. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అయిన వైట్ల, ఇప్పుడు కనీసం యావరేజ్ హిట్ కూడా కొట్టలేక స్ట్రగుల్ అవుతున్నారు. అటు అవకాశాలు లేని పూజ, ఇటు ఫామ్ లేని వైట్ల.. వీరిద్దరూ కలిసి శర్వానంద్‌తో సినిమా అంటే అది ఒక ‘డెడ్లీ కాంబినేషన్’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. హిట్ ట్రాక్‌లో లేని ఈ ఇద్దరూ కలిసి శర్వానంద్ కెరీర్‌ను కూడా రిస్క్ లో పడేస్తున్నారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్ కూడా.

శ్రీను వైట్ల సినిమాతో పూజాకు కలిసొస్తుందా?

వాస్తవానికి  వైట్ల సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం పాటల కోసం, గ్లామర్ కోసం మాత్రమే ఉంటుంది.సో  పూజా హెగ్డే కూడా తన మునుపటి గ్లామర్ తో మరోసారి రెచ్చిపోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ, ఇప్పుడు ఆడియన్స్ మైండ్‌సెట్ మారింది. కేవలం ఎక్స్ పోజింగ్ చూసి హిట్ ఇచ్చే రోజులు పోయాయి. రాధే శ్యామ్ లో పూజ అందంగా కనిపించినా, కంటెంట్ లో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులు కనికరించలేదు. ఇప్పుడు వైట్ల మార్క్ పాత చింతకాయ పచ్చడి కామెడీలో పూజ అందాలు ఏ మేరకు సినిమాను కాపాడతాయో అని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే నిజమైతే మాత్రం  పూజా హెగ్డేకు ఇదే ఆఖరి అవకాశం అని చెప్పాలి. ఒకవేళ ఈ శర్వానంద్ సినిమా కూడా తేడా కొడితే, టాలీవుడ్ నుంచి ఈ అమ్మడు శాశ్వతంగా కనుమరుగవ్వడం ఖాయం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ కూడా ఈమెకు లైఫ్ ఇవ్వలేకపోయారు, మరి ఇప్పుడు వైట్ల ఇచ్చే ‘కామెడీ కిక్’ ఈమె కెరీర్ కు ఎంతవరకు బూస్ట్ ఇస్తుందో చూడాలి. పూజ ఈ సారైనా ‘ఐరన్ లెగ్’ ముద్రను చెరిపేసుకుంటుందా లేక ఫ్లాపుల రికార్డును పదిలం చేసుకుంటుందా అనేది సస్పెన్స్ గా మారింది.

శర్వానంద్ తో సినిమా పూజా హెగ్డేకు చివరి అవకాశమా?

మొత్తానికి పూజా హెగ్డే కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం కానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం, శర్వానంద్ కాంబినేషన్ ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఆమె టాలీవుడ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.