
📌 Key Points
- పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు: పాన్ ఇండియా హీరోతో చేదు అనుభవం!
- క్యారవాన్ లోకి అనుమతి లేకుండా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పూజ
- హీరో అసభ్య ప్రవర్తనతో షాక్ తిన్న పూజ హెగ్డే
- తలపతి విజయ్ తో పూజ హెగ్డే ‘జన నాయగన్’ సినిమా వాయిదా!
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సంచలన విషయాలు వెల్లడించింది. ఒక పాన్ ఇండియా హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, క్యారవాన్ లోకి అనుమతి లేకుండా రావడంతో చెంప పగలగొట్టానని తెలిపింది. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
పాన్ ఇండియా సినిమాలో చేదు అనుభవం
Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజ హెగ్డే సంచలన కామెంట్స్ చేసింది. తనతో ఒక హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, లాగిపెట్టి కొట్టానని చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన చేదు అనుభవాలను ఆడియన్స్ తో పంచుకుంది. ఆ సమయంలో తనకు వచ్చిన ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు చాలా హ్యాపీగా ఒకే చేసిందట. పాన్ ఇండియా స్టార్ హీరోగా తో సినిమా అవడంతో ఆనందంతో గంతులు వేసిందట.
ఈ విషయం గురించి పూజ హెగ్డే(Pooja Hegde) మాట్లాడుతూ.. ‘నా కెరీర్ బిగినింగ్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ ఫీలయ్యాను. కానీ, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక చేదు సంఘటన ఎదురయ్యింది. నా అనుమతి లేకుండా ఆ హీరో నా క్యారవాన్ లోకి వచ్చాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు.
హీరో ప్రవర్తనతో షాక్ తిన్న పూజ
సహనం కోల్పోయిన నేను ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను. వెంటనే, వ్యాన్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను ఆ హీరోతో చేయడానికి ఇష్టపడలేదు. నా సీన్స్ ని డూపుని పెట్టి తీశారు’ అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. దీంతో పూజ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, తనతో మిస్ బిహేవ్ చేసిన ఈ హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు పూజ.
‘జన నాయగన్’ విడుదల వాయిదా
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పూజ హెగ్డే తలపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తోంది. విజయ్ చివరి సినిమాగా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ నుంచి వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.
పూజా హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.


