|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షாக்: మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి పూజా హెగ్డే రీఎంట్రీ.. ఈసారైనా రికార్డు కొడుతుందా?

Published: 11-04-2026, 2:35 PM
షாக்: మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి పూజా హెగ్డే రీఎంట్రీ.. ఈసారైనా రికార్డు కొడుతుందా?
  • దుల్కర్ సల్మాన్‌తో పూజా హెగ్డే.. ‘DQ 41’ మూవీతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ!
  • మూడేళ్ల విరామం తర్వాత తెలుగు తెరపై మెరవనున్న పూజా అందాలు! ఫ్యాన్స్ ఖుషీ!!
  • పాన్ ఇండియా మూవీగా ‘DQ 41’.. రవి నెలకుడిటి దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథ!
  • హైదరాబాద్‌లో ‘DQ 41’ షూటింగ్ ప్రారంభం.. త్వరలోనే మరిన్ని అప్డేట్స్!

టాలీవుడ్ ప్రేక్షకులకు పూజా హెగ్డే గుడ్ న్యూస్! ఈ బుట్టబొమ్మ మళ్ళీ తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘DQ 41’ అనే సినిమాలో నటించనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లో రీఎంట్రీ!

వరుస పరాజయాలు ఎదుర్కొంటునప్పటికీ బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద హిట్లు లేకపోయిన బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు మాత్రం అమ్మడు చెంతుకు చేరుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ ‘ఆచార్య’ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా అనౌన్స్ చెయ్యలేదు ఈ బ్యూటీ. 2022లో విడుదలైన ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది పూజా. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘DQ 41’. ఈ పాన్ ఇండియా ప్రేమకథకు రవి నెలకుడిటి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం ద్వారా పూజా మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ఎంట్రీ ఇవ్వబోతుంది. సుధాకర్ చెరుకూరి నర్మిస్తున్న ‘DQ 41’ కు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇది ఒక ఎమోషనల్ అన్‌కండిషనల్ ప్రేమకథ అని తెలుస్తుండగా.. ఈ సినిమాతో అయినా పూజా తెలుగులో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.

‘DQ 41’తో పూజా హెగ్డే సంచలనం సృష్టిస్తుందా?

దుల్కర్ సల్మాన్‌తో కలిసి పూజా మ్యాజిక్ చేస్తుందా?

పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘DQ 41’ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.