
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్‌లో భారీ ఆఫర్ అందుకుంది. అల్లు అర్జున్-అట్లీ దర్శకత్వంలో రాబోతున్న 800 కోట్ల బడ్జెట్ చిత్రంలో కేవలం 5 నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వరుస ప్లాపుల తర్వాత పూజాకు ఇది బంపరాఫర్‌గా మారింది.
Key Points
పూజా హెగ్డేకు 800 కోట్ల బడ్జెట్ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఆఫర్.
ఈ సాంగ్ కోసం ఆమెకు 5 కోట్ల పారితోషికం అఫర్ చేసినట్లు ప్రచారం.
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లోని AA22xA6 ప్రాజెక్ట్‌లో పూజా నటించనుంది.
"కూలీ" సినిమా సాంగ్ సక్సెస్ తో పూజాకు డిమాండ్ పెరిగింది.
పూజా హెగ్డేకు అరుదైన అవకాశం
స్టార్ హీరోయిన్ గా వరుస సక్సెస్ లు అందుకున్న పూజా హెగ్డే.. మధ్యలో వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ అన్న విమర్శలు ఫేస్ చేసింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసిన పూజా.. ఆతరువాత వరుసగా ప్లాప్ లు కూడా చూసింది. ఎంత ప్రయత్నించిన ఒక్క హిట్ పడకపోవడంతో.. ఇండస్ట్రీలో పూజాకు ఆఫర్లు తగ్గిపోయాయి. పూజా ఉంటే సినిమా ప్లాప్ అవుతుందన్న టాక్ గట్టిగా నడిచింది. దాంతో కెరీర్ లో భారీ కుదుపును చూసింది పూజా హెగ్డే. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మంచి మంచి ఆఫర్లు కూడా పూజాకు వస్తున్నట్టు సమాచారం.
గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రెండు సినిమాల్లో నటించింది పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథమ్ మూవీతో పాటు అలవైకుంఠపురములో మూవీలో ఈ జంట సందడి చేశారు. ఇక ముచ్చటగా మూడోసారి బన్నీతో కలిసి ఆడబోతోంది పూజా. ఐకాన్ స్టార్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సబంధించిన ఆసక్తి కరమైన చర్చ ప్రస్తుతం జరగుతోంది. AA22xA6 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ ప్రాజెక్టులో ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. అంతే కాదు ఈ సాంగ్ కోసం పూజాకు ఏకంగా 5 కోట్లు పారితోషికంగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో భారీ సినిమా
రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమా వల్ల పూజాహెగ్డే కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈసినిమాలో పూజా డాన్స్ చేసిన మోనికా… సాంగ్ కు దేశ వ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వచ్చింది. కూలీ సినిమాకు ఈ సాంగ్ చాలా ప్లస్ అయ్యింది. పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి.. ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్‑అట్లీ వారి సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ను పెట్టాలని చూస్తున్నాట. ఈసాంగ్ పెడితే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు టాక్. ఈ ప్రతిపాదనకు ఆమె కూడ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
5 నిమిషాల సాంగ్‌కు 5 కోట్లు!
దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ తో AA22xA6 సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో సైన్స్‑ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ జంటగా ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంలో మూవీ టీమ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
పూజా హెగ్డే కెరీర్‌లో ఈ భారీ ఆఫర్ ఒక టర్నింగ్ పాయింట్ కానుంది. 800 కోట్ల బడ్జెట్ మూవీలో ఆమె స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత క్రేజ్ తెస్తుందని, ఆమెకు కూడా పూర్వ వైభవం లభిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


