|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతో బతికేశా.. ఈ ఎడబాటు భరించలేకపోయా..: పూర్ణ భర్త ఎమోషనల్‌

Published: 27-08-2025, 2:43 PM
రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతో బతికేశా.. ఈ ఎడబాటు భరించలేకపోయా..: పూర్ణ భర్త ఎమోషనల్‌

ప్రముఖ నటి పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ తన భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 45 రోజులు పూర్ణ దూరంగా ఉండటం వల్ల ఆయన ఎంతగా బాధపడ్డారో వెల్లడించారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Key Points

1

నటి పూర్ణ భర్త 45 రోజుల ఎడబాటును ఎలా భరించారో వెల్లడించారు.

2

పూర్ణ చిత్రీకరణల నిమిత్తం దూరంగా ఉన్నారని వివరణ ఇచ్చారు.

4

దంపతులు తమ కుటుంబ ఫోటోలను పంచుకుంటూ సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

పూర్ణ భర్త ఎమోషనల్ పోస్ట్

సీమ టపాకాయ్‌, అవును చిత్రాలతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూర్ణ ( Poorna ). మొదట్లో కథానాయికగా నటించినా తర్వాత సహాయ నటిగా మారింది. అఖండ, దృశ్యం 2, దసరా, భీమా.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా యాక్ట్‌ చేసింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటలో నటించింది. ఇదిలా ఉంటే పూర్ణ.. 2022లో వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

రాత్రిళ్లు నీ జ్ఞాపకాలే.. తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు, ఈవెంట్స్‌ అంటూ బిజీగానే గడిపేస్తోంది. అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈ 45 రోజులు నా జీవితంలోనే మర్చిపోలేను. ఒంటరితనపు నిశ్శబ్ధాన్ని భరించలేకపోయాను. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతోనే గడిపేశాను. ప్రతిరోజు ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేవాడిని.

45 రోజుల ఎడబాటు

నా భార్య తిరిగొచ్చింది ఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్పనైన వరం. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్‌ వల్ల ఆనందభాష్పాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన చాలామంది ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ కలిసి లేరా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

క్లారిటీ ఇచ్చిన పూర్ణ భర్త దీనికి పూర్ణ భర్త స్పందిస్తూ.. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్‌ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. మాకు పెళ్లయి మూడేళ్లవుతున్నా.. ఇన్నిరోజులు దూరంగా ఎప్పుడూ లేము. అందుకే, అలా పోస్ట్‌ పెట్టాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకుండి. దేవుడి దయ వల్ల మేమంతా సంతోషంగా ఉన్నాం అని వివరణ ఇచ్చాడు. ఇందుకు తన ఫ్యామిలీ ఫోటోలు జత చేశాడు.

చిత్రీకరణల కారణంగా దూరం

చివరకు పూర్ణ తిరిగి వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దంపతులిద్దరూ తమ కుటుంబంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.