
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజును పవన్ కళ్యాణ్ సహా మొత్తం యూనిట్ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Key Points
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో శ్రీలీల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
పవన్ కళ్యాణ్, మూవీ యూనిట్ శ్రీలీలతో కేక్ కట్ చేశారు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీలీల పుట్టినరోజు వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) ఒకటి. దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా షూటింగ్‌ని పూర్తిచేసే పనిలో పడ్డారు మూవీ టీమ్.
అయితే కొన్ని రోజుల క్రితం పవన్ ఈ షూట్‌లో జాయిన్ అయిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల శ్రీ లీల పుట్టిన రోజు జరగ్గా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో శ్రీలీల పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్, మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ కట్ చేయించి ఆమె పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశారు. ఇక ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్‌లో ఉన్నారు. అలాగే హరీష్ శంకర్, మైత్రి నిర్మాత రవి శంకర్, కెమెరామెన్, శ్రీ లీల, శ్రీ లీల తల్లి.. పలువురు సినిమా సాంకేతిక నిపుణులు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ సమక్షంలో వేడుకలు
వైరల్ అవుతున్న ఫోటో
చివరగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్లో జరిగిన శ్రీలీల పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ సహా మొత్తం యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


