
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ చిత్రం విజయ్ ‘బద్రి’గా రీమేక్ అయ్యి బ్లాక్‌బస్టర్ సాధించింది.
- పవన్ ‘సుస్వాగతం’, ‘ఖుషి’, ‘అన్నవరం’ విజయ్ చిత్రాలకు రీమేక్‌లుగా భారీ విజయం.
- ‘తమ్ముడు’ 1999లో విడుదలై సంచలనం సృష్టించగా, ‘బద్రి’ 2001లో విడుదలైంది.
- పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలోనే పవన్, విజయ్ ఇద్దరూ ఈ సినిమాల్లో నటించారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ దళపతి విజయ్ మధ్య సినీ బంధం గురించి సరికొత్త చర్చ మొదలైంది. వీరిద్దరి కెరీర్‌లో ఒకరి సినిమాను మరొకరు రీమేక్ చేసుకున్న అద్భుత ఘట్టాలు చాలానే ఉన్నాయి. అయితే విజయ్, పవన్ కళ్యాణ్ సినిమాను రీమేక్ చేసింది కేవలం ఒక్కసారే! ఆ సంచలనం ఏంటో తెలుసా?
పవన్ – విజయ్: ఒకే దారిలో స్టార్స్!
తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల్లో గెలిచి అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గురించి సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు, వారిద్దరి మధ్య ఉన్న సినిమా బంధం గురించి కూడా చర్చ జరుగుతోంది.
దళపతి విజయ్ ,పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ తమ భాషల్లో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇద్దరి వయసు ఇంచుమించు ఒకటే. సినిమాల పరంగా మాత్రమే కాకుండా అభిమానుల విషయంలో, అలాగే రాజకీయాల్లో కూడా వీరిద్దరి దారి ఒకటే. అంతే కాదు సినిమాలు చేస్తున్న టైమ్ లో కూడా ఇద్దరు ఒకరి సినిమాలను మరొకరు రీమేక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ దళపతి మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే.. విజయ్ మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి ఒకే ఒక్క సినిమాను రీమేక్ చేశాడు.
పవర్ స్టార్ రీమేక్ చేసిన విజయ్ సినిమాలు!
విజయ్ నటించిన మూడు తమిళ్ సినిమాలను పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేశారు. వాటిలో ‘లవ్ టుడే’ సినిమాను ‘సుస్వాగతం’గా, ‘ఖుషి’ సినిమాను అదే పేరుతో ‘ఖుషి’గా, ‘తిరుప్పాచ్చి’ సినిమాను ‘అన్నవరం’గా రీమేక్ చేశారు. ఈ సినిమాలు తెలుగులో మంచి గుర్తింపు పొందాయి. ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సుస్వాగతం కూడా హిట్ అవ్వగా.. అన్నవరం మాత్రం యావరేజ్ గా నిలిచింది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో విజయ్ ఒక్క సినిమానే రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ను తమిళ్‌లో ‘బద్రి’ పేరుతో విజయ్ రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రీతీ జింటా హీరో హీరోయిన్లుగా నటించిన ఈమూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందింది.
దళపతి రీమేక్ చేసిన పవన్ బ్లాక్‌బస్టర్!
తమ్ముడు’ సినిమా 1999లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అదే సినిమాను పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలోనే విజయ్, భూమికలతో తమిళ్‌లో 2001లో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. అయితే విజయ్ దళపతి తెలుగు నుంచి చాలా సినిమాలను తమిళ్ లో రీమేక్ చేశారు. అందులో ఒక్కడు, నువ్వునాకు నచ్చావ్, పెళ్లి సందడి, పోకిరి లాంటి హిట్లు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్, విజయ్ మధ్య ఈ ప్రత్యేక అనుబంధం సినీ లోకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాల కోసం వేచి చూడండి! మీ అభిమాన హీరోల అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.


