
📌 Key Points
- పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి ‘OG 2’ చర్చలపై అధికారిక ప్రకటన.
- దర్శకుడు సుజీత్‌తో పవన్ కళ్యాణ్ కథా చర్చలు ప్రారంభం, ఫొటోలు వైరల్.
- మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘OG 2 – ది డ్రాగన్ వారియర్’ త్వరలో షురూ అని ట్వీట్.
- రాజకీయ బిజీ షెడ్యూల్‌లోనూ పవర్ స్టార్ సినిమాపై ఫోకస్, ఫ్యాన్స్ ఖుషీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ వాతావరణం! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘OG 2 – ది డ్రాగన్ వారియర్’ పై ఊహించని క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ వార్తతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు!
ఓజీ యూనివర్స్: అంచనాలకు మించి వేగంగా అప్డేట్!
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG). గతేడాది దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిందా లేదా?, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా? అనే చర్చలు పక్కన పెడితే.. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసింది. పవన్ సైతం ఈ చిత్రంతో సంతోషంగా ఉన్నారు. అందుకే ‘ఓజీ యూనివర్స్’లో మరికొన్ని సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ‘OG 2’ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ అందించారు. ‘ఓజీ’ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌గా ‘ఓజీ 2’ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై కీలక ప్రకటన చేసింది. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభవుతాయని తెలిపింది. అయితే ఇది అప్పుడప్పుడే కార్యరూపం దాల్చకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ పది రోజులు తిరక్కుండానే ‘OG 2’ చర్చలు షురూ మొదలయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. * అనిల్ రావిపూడి రక్తంతో వీర తిలకం దిద్దిన వెంకటేష్.. వీడియో వైరల్ ”పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగానే, క్రియేటివ్ వర్క్స్ లో దర్శకుడు సుజీత్‌తో ‘OG యూనివర్స్’కు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి” అని ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. సుజీత్, పవన్ కలిసి కథా చర్చల్లో పాల్గొన్న ఫొటోలను పంచుకుంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ స్పందిస్తూ.. ”ఓజీ 2′ ది డ్రాగన్ వారియర్.. త్వరలో ప్రారంభం కానుంది” అని ట్వీట్ చేశారు. ఈ ఊహించని అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బవుతున్నారు. * ఒకప్పుడు బూతులు, ఇప్పుడు పొగడ్తలు.. మళ్లీ కలిసిపోయిన త్రివిక్రమ్ – బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే కమిటైన సినిమాలను దాదాపుగా పూర్తి చేసేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, సుజీత్ డైరెక్షన్ లో ‘ఓజీ 2’ చిత్రాలు ఆయన లైనప్ లో ఉన్నాయి. మంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్.. ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు రాకపోవచ్చని అభిమానులు భావించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజాస్టర్ గా మారిన తర్వాత, ఇప్పట్లో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించకపోవచ్చని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం దానికి భిన్నంగా.. రెండు పడవల ప్రయాణం సాగించడానికే మొగ్గు చూపుతున్నారని ‘ఓజీ 2’ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. స్పీడ్ చూస్తుంటే.. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే ‘ఓజీ’ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.
పవన్ కళ్యాణ్, సుజీత్: కథా చర్చల్లో ఏం జరిగింది?
థమన్ ట్వీట్: ‘ది డ్రాగన్ వారియర్’ ఎప్పుడు?
నిర్మాణ సంస్థ, సంగీత దర్శకుడు ఇచ్చిన ఈ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాయి. ‘OG 2’ పై మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


