|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘వారణాసి’లో పవర్‌ఫుల్‌ దేవత.. రాజమౌళి ప్లాన్‌ అదుర్స్‌

Published: 16-11-2025, 2:51 AM

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలతో ముడిపడిన కథలో పవర్‌ఫుల్‌ దేవత చిన్నమస్తా దేవి పాత్ర కీలకం కానుంది. ఆమె శక్తిని మహేష్‌ బాబు ఎలా పొందుతారనేది చూడాలి.

Key Points

1

మహేష్‌ బాబు-రాజమౌళి 'వారణాసి' సినిమా గ్లింప్స్‌ విడుదల. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలతో లింక్.

2

చిన్నమస్తా దేవి, దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత, సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

4

వారణాసిలో ఛిన్నమస్తా దేవి ఆలయం ఉంది, ఇది సినిమా కథకు మరింత ప్రామాణికతను ఇస్తుంది.

వారణాసిలో చిన్నమస్తా దేవి ప్రాధాన్యత

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్‌ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్‌ గురించి కాస్త హింట్‌ వచ్చేసింది. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది. భూమి ఆవిర్భావం మొదలు.. త్రేతా యుగం వరకూ ఆపై ఉల్కాపాతాల ప్రళయం, ఘోర కలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్‌ అయినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్‌ లైన్‌ మహేష్‌ అని కనిపిస్తుంది. అయితే, ఇందులో రాక్షస ఘణాన్ని వేటాడే ‘ఛిన్నమస్తా దేవి’ విజువల్‌ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి. ఆపై ఎదుటివారు  ఎంతటి గొప్పవారైనే సరే చీల్చిచెండాడే శక్తి సొంతమౌతుంది.

చిన్నమస్తా దేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారు తన తలను తన  చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె తల నుంచి వచ్చే రక్తాన్ని కుడి, ఎడమ పక్కన ఉన్న డాకిని, వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది. ఎంతో భయంకరంగా కనిపించేలా ఆమ్మవారి రూపం ఉంటుంది. ఈమెను శక్తి యొక్క రౌద్ర రూపంగా పూజిస్తారు. చిన్నమస్తా దేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు  సృష్టి, వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది. ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు.

కాలాలతో చిన్నమస్తా దేవి లింక్

వారణాసితో లింక్‌ చిన్నమస్తా దేవి భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్ర పాత్రలో ఉన్న మహేష్‌ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.  ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రాక్షస ఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్త దాహం తీరలేదు. తన వెంట ఉన్న వారికి కూడా తీరకపోవడంతో  స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది. అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది. సినిమా ప్రకారం ఉన్న రాక్షస ఘణాన్ని ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని రుద్ర పాత్రలో ఉన్న మహేష్‌ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది.

మహేష్‌ పాత్రకు దేవత ఆశీస్సులు

ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది. ఆమె శత్రు నాశని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు. ఆమె పార్వతి దేవి రూపం అని కూడా పూరాణాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని రామ్‌నగర్‌లో ఆమె ఆలయం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో కూడా ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉంది.

రాజమౌళి ‘వారణాసి’లో చిన్నమస్తా దేవి పాత్రను ఎంచుకోవడం సినిమాపై అంచనాలను పెంచింది. ఆమె ఉగ్రరూపం, మహిమలు కథకు సరికొత్త కోణాన్ని ఇస్తాయి. మహేష్‌ బాబు పాత్ర ద్వారా ఈ దేవత శక్తిని ఎలా చూపిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.