📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాలో జోకర్ పాత్రలో కనిపించనున్నారు.
- అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీలో చీర కట్టులో కనిపించి అందరినీ అలరించారు.
- ఎలాంటి పాత్రలకైనా సిద్ధమంటూ సోషల్ మీడియాలో వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాలు రానున్నాయి.
టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లు అర్జున్ చీర కట్టులో, ప్రభాస్ జోకర్ అవతారంలో అలరించి, ఎలాంటి పాత్రకైనా సిద్ధమని నిరూపించారు. వారి అంకితభావానికి అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పాత్ర ఏదైనా తగ్గేదేలే: ప్రభాస్, అల్లు అర్జున్
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్, అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా కోసం ఎలాంటి పాత్రలైన చేసేందుకు ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడూ ముందు ఉంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2 సినిమాలో చీర కట్టి అల్లు అర్జున్ అందర్నీ అలరించాడని, ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాలో జోకర్ పాత్రలో కనిపించి ప్రభాస్ అందరినీ ఆకట్టుకుంటున్నాడని అంటున్నారు. పుష్ప 2 మూవీ తరహాలోనే ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ కు మంచి పేరు వస్తుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరోలు అయినప్పటికీ, ఎలాంటి పాత్ర అయినా వేసేందుకు అల్లు అర్జున్, ప్రభాస్ ముందు ఉంటారని సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతే కాదు చీర కట్టులో అల్లు అర్జున్, జోకర్ గా ఉన్న ప్రభాస్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి, మా హీరోలు తోపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది హీరోలు, ప్రెస్టేజ్ అంటూ చిన్న పాత్రలు చేయడం లేదని చురకలు అంటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వo వహిస్తున్నారు. ఇక అటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1000 కోట్లతో తీస్తున్నారట.
చీరలో అల్లు అర్జున్, జోకర్‌గా ప్రభాస్
అభిమానుల ప్రశంసలు, రాబోయే చిత్రాలు
ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లు పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తారని రుజువు చేశారు. వారి అద్భుతమైన నటన, వైవిధ్యమైన పాత్రల ఎంపిక తెలుగు సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తున్నాయి. అభిమానులకు ఇది గొప్ప ఉత్సాహాన్నిస్తోంది.

