|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హీరో కాకముందు ప్రభాస్ అడ్డ అదేనా? ఫ్యాన్ రివీల్ చేసిన సంచలన నిజాలు వైరల్!

Published: 21-02-2026, 10:05 PM
  • పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన అభిమాని!
  • `కపుల్ ఫ్రెండ్లీ` మూవీ ప్రమోషన్స్‌లో ప్రభాస్.. చివరి 20 నిమిషాలు ఎమోషనల్ అన్నారు!
  • ముంబైలో `ఆదిపురుష్‌` షూటింగ్ సమయంలో చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు!
  • హీరో కాకముందు మెదక్‌లోని గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రభాస్ సందడి.. లక్ష్మీ టాకీస్‌లో చిల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది! ప్రభాస్ హీరో కాకముందు ఏం చేసేవాడో తెలుసా? ఒక అభిమాని బయటపెట్టిన నిజాలు ఇప్పుడు హాట్ టాపిక్!

ప్రభాస్ ఫ్యాక్టరీ సీక్రెట్స్ లీక్ చేసిన అభిమాని!

`బాహుబలి` మూవీతో ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. ఆయన పాన్‌ ఇండియా హీరో అయ్యారు. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గానూ రాణిస్తున్నారు. ఆయన చిత్రాలు ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. కాకపోతే ఇటీవల సరైన హిట్‌ పడటం లేదు. `సలార్‌`, `కల్కి 2898 ఏడీ` చిత్రాలు ఆడినప్పటికీ అభిమానుల్లో ఏదో వెలితి. ఇప్పుడు చేస్తున్న `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. తమ ఆకలి తీర్చే మూవీస్‌ ఇవే అవుతాయని భావిస్తున్నారు.

అయితే ప్రభాస్‌ ఇటీవల `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ టీమ్‌తో చిట్‌ చాట్‌ చేశారు. తమ హోమ్‌ బ్యానర్‌ యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ మూవీని ప్రమోట్‌ చేసే బాధ్యతలు తీసుకున్నారు. హీరోహీరోయిన్లు సంతోష్‌ శోభన్‌, మానస వారణాసిలను ఎంకరేజ్‌ చేశారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు. చివరి ఇరవై నిమిషాలు ఎమోషనల్‌గా ఉందని, దాన్నుంచి బయటకు రావడానికి చాలా టైమ్‌ పట్టిందన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ తన ఫుడ్ గురించి చెప్పిన విషయాలు వైరల్‌ అయ్యాయి. సంచలనంగా మారాయి. ఆయన ముంబయిలో `ఆదిపురుష్‌` షూటింగ్‌లో ఉన్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడట. ఇది చూసి చిత్ర బృందం షాక్‌ అయినట్టు తెలిపారు. ఇలాంటి క్రేజీ విషయాలు ప్రభాస్‌లో చాలానే ఉన్నాయి.

`కపుల్ ఫ్రెండ్లీ` మూవీతో ప్రభాస్ బిజీ అప్డేట్స్

బేసిక్‌గా ప్రభాస్‌ ఫుడ్‌ లవర్. వివిధ రకాల ఫుడ్‌ టేస్ట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటుంటారు. ఆయన కూడా అదే చెబుతుంటారు. ప్రభాస్‌ నటించే ప్రతి సినిమా షూటింగ్‌ టైమ్‌లో తమ కో స్టార్స్ కి తన ఇంటిఫుడ్‌ తినిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. ఆయన ఫుడ్‌ గురించి చెప్పని ఆర్టిస్ట్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే హీరో కాకముందు ప్రభాస్‌ చేసిన పని ఒకటి బయటకు వచ్చింది. ఆయన ఎలాంటి ఫుడ్‌ లవర్‌ అనేది ఓ అభిమాని తెలిపారు.

మెదక్‌ లో కృష్ణంరాజు కుటుంబానికి గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఉండేదట. గోపీకృష్ణ గ్రానైట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ ఫ్యాక్టరీ నిర్వహించారు. అయితే ఇది పెద్దగా లాభాల్లో ఉండేది కాదని, కార్మికుల కోసం దాన్ని నిర్వహిస్తున్నామని అప్పట్లో ఆర్కే ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తెలిపారు. ప్రభాస్‌ చిన్నగా ఉన్నప్పుడు ఇది బాగానే నడిచేదట. అప్పుడప్పుడు ప్రభాస్‌ కూడా వచ్చిపోయేవారట. ఈ క్రమంలో  అక్కడికి ఎప్పుడు వచ్చినా టౌన్‌లో ఉన్న లక్ష్మీ టాకీస్‌  వెళ్లేవారట. పక్కన ఫోటో స్టూడియోలో కూర్చునేవారట. అయితే లక్ష్మీ థియేటర్‌ ఓనర్‌కి మిర్చీ బండి కూడా ఉండేదని, ఆ ఫోటో స్టూడియో ముందు  కూర్చొని బజ్జీలు ఎంతో ఇష్టంగా తినేవారట. ఇప్పటికీ ఆ స్టూడియో గ్యాలరీలో ఆయన కూర్చున్న ఫోటోలు ఉన్నాయని అక్కడి అభిమాని ఒకరు వెళ్లడించారు. బజ్జీలంటే అప్పుడు బాగా ఇష్టపడేవాడట. ఎప్పుడు వచ్చినా వాటిని టేస్ట్ చేయకుండా వెళ్లేవారు కాదట. ఇప్పుడీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఫుడ్ విషయంలో ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా!

ఇక `కపుల్‌ ఫ్రెండ్లీ` ఇంటర్వ్యూలో ప్రభాస్‌ తనకు ఇష్టమైన పునుగుల గురించి తెలిపారు. చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు విజయవాడ పునుగులంటే ఇష్టమని చెప్పారు. చిన్నప్పుడు సమ్మర్‌ హాలీడేస్‌లో తన బెస్ట్ ఫ్రెండ్‌ ప్రమోద్‌ వాళ్ల ఇంటి దగ్గర పునుగులు తినేవాడిని అని, అలాంటివి మళ్లీ ఎక్కడా తినలేదని, చెప్తుంటే ఇప్పుడూ నోరూరుతుంది, అక్కడికి వెళ్లినప్పుడల్లా తినాలనిపిస్తుందన్నారు. ఇలా తన ఫుడ్‌ కోరికలు బయటపెట్టి ఆశ్చర్యపరిచారు డార్లింగ్‌.

ప్రభాస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.