|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రక్తపు మడుగులో ప్రభాస్ క్రూరమైన లుక్: ‘స్పిరిట్’ నుంచి షాకింగ్ పోస్టర్ లీక్, వైరల్!

Published: 29-12-2025, 12:28 AM
రక్తపు మడుగులో ప్రభాస్ క్రూరమైన లుక్: ‘స్పిరిట్’ నుంచి షాకింగ్ పోస్టర్ లీక్, వైరల్!
  • ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతోంది.
  • త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాజోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
  • ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
  • రక్తపు మడుగులో క్రూరంగా చూస్తున్న ప్రభాస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి ఒక షాకింగ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ప్రభాస్ ‘స్పిరిట్’: దర్శకుడు, హీరోయిన్ వివరాలు

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabahs) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’(spirit) మూవీ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి (Tripti Dimri) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కంచన బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారట.

వైరల్ అవుతున్న ప్రభాస్ రక్తసిక్తమైన లుక్

అయితే ఈ సినిమాలో డార్లింగ్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, డెప్త్ క్యారెక్టర్ ఉన్న రోల్‌ క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 ఎండింగ్‌లో అయినా 2027 స్టార్టింగ్‌లో అయినా రిలీజ్ చేయనున్నారు.

రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్

ఈ క్రమంలో స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఫొటోలో.. ప్రభాస్ రక్తంతో తడిసి పోయి ఉన్నాడు. కారుకు ఆనుకొని కింద కూర్చున్న అతని క్రూరమైన లుక్ అందరినీ భయపెట్టిస్తున్నది. కారుతో పాటు కింద భూమి కూడా మొత్తం రక్తసిక్తమై కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ సారి రణరంగమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి, రక్తపు మడుగులో ప్రభాస్ క్రూరమైన లుక్ ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్ పాత్ర, సినిమా కంటెంట్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.