|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను తిట్టే వాళ్లకు చెప్తున్నా.. మీ తిట్లే నాకు ఎనర్జీ: ప్రభాస్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 11-12-2025, 1:48 AM
నన్ను తిట్టే వాళ్లకు చెప్తున్నా.. మీ తిట్లే నాకు ఎనర్జీ: ప్రభాస్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • డైరెక్టర్ మారుతి ‘త్రీ రోజెస్‌’ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
  • నెగటివ్ కామెంట్స్‌ను ఎలా ఎనర్జీగా మార్చుకోవాలో వివరించారు.
  • నటి ప్రగతి, ప్రభాస్ ఉదాహరణలను ప్రస్తావించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
  • తమ ఎదుగుదలకు నెగటివ్ కామెంట్స్ చేసే వారే కారణమని మారుతి ధన్యవాదాలు తెలిపారు.

ప్రభాస్ డైరెక్టర్ మారుతి, ‘త్రీ రోజెస్‌’ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టే వాళ్ల తిట్లే తనకు ఎనర్జీని ఇస్తాయని, నెగటివ్ కామెంట్స్ ఎంత ముఖ్యమో వివరించారు. ప్రస్తుతం మారుతి కామెంట్స్ వైరల్‌గా మారాయి.

డైరెక్టర్ మారుతి సంచలన వ్యాఖ్యలు

ఈషా రెబ్బా(esha Rebba), సత్య(Sathya), హర్ష చెముడు(Harsha Chemudu), ప్రిన్స్‌ సిసిల్‌(Prince Sisil), హేమ(Hema), సత్యం రాజేశ్‌(Sathyam Rajesh), కుషిత కల్లపు(Kushitha Kullapu) ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ కామెడీ వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌’(3 Roses). ఆహా(Aha) ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్-2 ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్(SKN) నిర్మిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌కు కిరణ్‌ కె.కరవల్ల(Kiran K Karavalla) దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్‌ మారుతి(Maruthi) షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు నటి ప్రగతికి చాలా ఎమోషనల్ డే అవ్వచ్చు.. అది మాకు కన్వే అయింది. మేడమ్ మీరు అందరూ మిమ్మల్ని తిడుతున్నారని బాధపడకండి.

ఎందుకంటే అలా తిట్టకపోతే మీరు ఈ గోల్డ్ మెడల్ సాధించేవారు కాదు, నేను రాజా సాబ్ తీసేవాడిని కాదు. వాళ్లు వాళ్ల పనులన్నీ మానుకుని మన కోసం టైమ్ పెట్టి వాళ్ల కాన్సంట్రేషన్ మొత్తం మన మీద పెట్టి వాళ్లలో ఉన్న పాజిటీవిటీని మొత్తం చంపుకొని ఒక నెగెటివిటీని తెచ్చుకుని వాళ్ల బ్రెయిన్ అంతా నెగటివ్ చేసుకుని మనల్ని తిడుతున్నారంటే అది అంత ఈజీ పని కాదు. పాపం వాళ్ల దగ్గర ఏం ఉంటుంది నాలుగు బూతు మాటలు, నాలుగు తిట్లు ఉంటాయి. వాటినే వాళ్లు పంచుతున్నారు. అయితే నేను ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా ఒరేయ్ నీ దగ్గర ఉన్నది ఇదేనా.. ఇంకేమీ లేదా అని అనుకుంటాను.

నెగటివ్ కామెంట్స్ పై మారుతి అభిప్రాయం

మా నాన్న ఒకటే మాట చెప్పేవారు. తిట్టే వాళ్ల దగ్గర ఉన్నది తిట్లు మాత్రమే కాబట్టి అది మాత్రమే ఇస్తున్నారు. మన దగ్గర లేని దాని గురించి ఎందుకు బాధపడటం అని అనేవారు. కాబట్టి ఎవరైనా తిడుతున్నా దాన్ని ఎనర్జీగా మార్చుకోండి. అలా మార్చుకుంటే గోల్డ్ మెడల్స్ వస్తాయి ఇలాగా అని ప్రగతిను చూపిస్తాడు. ఫైనల్‌గా నేను చెప్పేది ఏమిటంటే నెగెటివ్ కామెంట్స్ చేసే వాళ్లందరికీ చాలా చాలా థాంక్స్ ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము.. మీరు తిట్టకపోతే మేము ఏం సాధించలేము అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

3 రోజెస్‌ సీజన్ 2 విశేషాలు

https://x.com/DailyCultureYT/status/1998780564153774554

మొత్తంగా, డైరెక్టర్ మారుతి నెగటివ్ కామెంట్స్ పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయం ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. విమర్శలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సందేశం స్పష్టం చేస్తుంది. ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.