|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ కన్నీళ్లు పెట్టిన సందర్భం: పాన్ ఇండియా స్టార్ ఎమోషనల్ కామెంట్స్

Published: 10-08-2025, 8:20 AM
ప్రభాస్ కన్నీళ్లు పెట్టిన సందర్భం: పాన్ ఇండియా స్టార్ ఎమోషనల్ కామెంట్స్

ప్రముఖ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన తొలి సినిమా ‘ఈశ్వర్’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక భావోద్వేగ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన తన తండ్రి ఆశీర్వాదం గురించి, ఆ క్షణంలో కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని వెల్లడించారు.

Key Points

1

ప్రభాస్ తన తొలి సినిమా 'ఈశ్వర్' షూటింగ్ సమయంలో జరిగిన భావోద్వేగ ఘటనను గుర్తు చేసుకున్నారు.

2

తండ్రి ఆశీర్వాదం తన కెరీర్‌కు ఎంతో ప్రేరణనిచ్చిందని ప్రభాస్ వెల్లడించారు.

4

ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్', 'ఫౌజీ' సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.

ఈశ్వర్ సినిమా షూటింగ్ లోని భావోద్వేగ క్షణం

యంగ్ రెబల్ స్టార్ దూసుకుపోతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో హడావిడి చేస్తున్నాడు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ప్రభాస్, ఆతరువాత వరుసగా మూడు పాన్ ఇండియా ప్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా సరే ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన క్రేజ్ కూడా అలాగే ఉంది. టైమ్ కోసం ఎదురు చూస్తూ.. తన పని తాను చేసకుంటూ వెళ్లిన యంగ్ రెబల్ స్టార్ కు, సలార్, కల్కీ రూపంలో మళ్లీ టైమ్ వచ్చింది. కోల్పోయిన ఫామ్ తిరిగి వచ్చింది. అదే జోష్ తో హ్యాట్రిక్ హిట్ కు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్.

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. కల్కి 2898 ఏ.డి. చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసిన ఆయన, కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్‌కు సంబంధించి ఓ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తండ్రి ఆశీర్వాదం ప్రభాస్ కెరీర్ పై ప్రభావం

ఈ వీడియోలో ప్రభాస్ తన తొలి సినిమా ఈశ్వర్ సమయంలో జరిగిన ఓ భావోద్వేగ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం జరుగుతుండగా నేను ఓ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు, ఈ ఈశ్వర్‌కు మూడు గుండెలు’ అని చెప్పాను. అయితే టెన్షన్‌లో ఉన్న కారణంగా డైలాగ్ తప్పుగా వచ్చింది. అప్పుడే మా నాన్న నా చేతిని పట్టుకుని ‘యస్’ అన్నారు. అప్పుడే నా కళ్లలో నీళ్లు వచ్చాయి,” అని ప్రభాస్ ఆ వీడియోలో చెప్పారు.

ఈ వ్యాఖ్యల ద్వారా తన కెరీర్ ప్రారంభంలో తండ్రి ఆశీర్వాదం తనకు ఎంత ప్రేరణ ఇచ్చిందో ప్రభాస్ వెల్లడించారు. ఈశ్వర్ సినిమాతో 2002లో హీరోగా పరిచయమైన ప్రభాస్, తరువాత వర్షం చిత్రంతో తొలిసారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈసినిమాతో ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. అనంతరం వరుస సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రభాస్, బాహుబలి సిరీస్‌తో ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించారు.

ప్రభాస్ ప్రస్తుత సినిమా ప్రాజెక్టులు

ప్రస్తుతం ప్రభాస్ ఐదారేళ్లకు సరిపడా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘రాజాసాబ్’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు టీమ్. రాజాసాబ్ తరువాత ప్రభాస్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాతో పాటు సలార్ 2 , కల్కీ 2 సినిమాలు కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని కథలను వింటున్న ప్రభాస్ త్వరాలో అందులో కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ప్రభాస్ కెరీర్ ప్రయాణంలో తండ్రి ప్రోత్సాహం ఎంతో ముఖ్యమైనదని ఈ ఘటన తెలియజేస్తుంది. ప్రస్తుతం బిజీగా ఉన్న ప్రభాస్, తన రాబోయే సినిమాలతో మరింత విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.