|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Rajasaab: అది ప్రభాస్ కాదు.. డూప్ తో సినిమా చేస్తావా.. మారుతీపై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్?

Published: 08-02-2026, 7:35 AM
The Rajasaab: అది ప్రభాస్ కాదు.. డూప్ తో సినిమా చేస్తావా.. మారుతీపై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్?
  • The Rajasaab సినిమా డిజాస్టర్‌తో దర్శకుడు మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం!
  • సినిమాలో ప్రభాస్ డూప్‌ను వాడారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్!
  • మారుతి ఇంటికి ఫుడ్, మెడికల్ పార్సిల్స్ పంపిన అభిమానులు.. షాకింగ్ సంఘటన!
  • ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రాజాసాబ్ వివాదం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమాపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతిపై ట్రోలింగ్ చేస్తూ, సినిమాలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!

రాజాసాబ్ రిజల్ట్‌తో మారుతిపై ట్రోలింగ్స్!

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్(The Rajasaab), సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ ఛాన్స్ ఇస్తే ఇలాంటి సినిమా చేస్తావా అంటూ మండిపడ్డారు. కథ, కథనం, డైరెక్షన్ విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటూ, అసలు ఆ కథ ప్రభాస్ చేయాల్సింది కానే కాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

అంతటితో ఆగకుండా, మారుతీ ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లో పార్సిల్స్ కూడా పంపారు. కొంతంది ఫుడ్ పార్సిల్స్, కొంతమంది మెడికల్ పార్సిల్స్ పంపించారట. ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ స్వయంగా సోషల్ మీడియాలో చెప్పాడు. రాను రాను ఆ మ్యాటర్ డైల్యూట్ అయ్యింది అనుకునే సమయంలో మరోసారి ఇప్పుడు మారుతీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. ఎందుకంటే, ది రాజాసాబ్ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.

ప్రభాస్ డూప్‌తో సినిమానా? ఫ్యాన్స్ ఆగ్రహం!

ఇప్పుడు, ఆ సినిమాను ఓటీటీ చూస్తూ ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయి అంటూ స్క్రీన్ షాట్స్ తీసి మరి మారుతీని ట్యాగ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక చాలా చోట్ల ప్రభాస్ ని కాకుండా అతని డూప్ తో సినిమా చేసినట్టుగా కనిపించింది అంటూ ఆ ఫేమ్ అటాచ్ చేసిన వీడియోలను, ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

డైరెక్టర్ మారుతికి ఫుడ్, మెడికల్ పార్సిల్స్!

ప్రభాస్ తో కాకుండా ఎవరితోనో సినిమా చేసి జనాల మీదకి వదులుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు హను రాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. మరోపక్క కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్.

ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తదుపరి సినిమాల గురించి, ఈ వివాదం గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.