|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రాజా సాబ్ నుంచి క్రేజీ అప్డేట్..!

Published: 27-06-2025, 8:46 PM
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రాజా సాబ్ నుంచి క్రేజీ అప్డేట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా గురించి తాజా అప్డేట్ వచ్చింది. సినిమా చివరి షెడ్యూల్ జులైలో హైదరాబాద్‌లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ కూడా చిత్రీకరిస్తారని సమాచారం.

Key Points

1

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.

2

సినిమా చివరి షెడ్యూల్ జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో జరుగనుంది.

4

నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ది రాజా సాబ్ చిత్రం షూటింగ్ అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ ప్రపంచ స్థాయికి ఎదిగింది. అప్పటినుంచి ఏడాదికి ఒక్కటి చొప్పున సినిమాలు మాత్రమే తీస్తున్నాడు. అంతేకాదు… ప్రభాస్ తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా కావడం గమనార్హం.

జులైలో చివరి షెడ్యూల్

ఇక ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను మారుతి చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ కోసం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను పెట్టాడు దర్శకుడు మారుతి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ ముగ్గురు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.

హైదరాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరణ

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఉన్నాడు. తమన్ మ్యూజిక్ అదరగొడుతున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. జులై మొదటి వారంలో.. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఉండనుందట. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనబోతున్నాడని సమాచారం. హైదరాబాద్ లో నిర్మించిన ప్యాలెస్ సెట్ లో.. ఈ చివరి షెడ్యూల్ మొత్తం జరగనుందని సమాచారం. ఇక్కడ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. దింతో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సబ్బరపడిపోతున్నారు.

చివరి షెడ్యూల్ పూర్తి కావడంతో ది రాజా సాబ్ సినిమా డిసెంబర్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్ అభిమానులకు ఇది గొప్ప వార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.