
📌 Key Points
- ప్రభాస్, మలయాళ దర్శకుడు దింజిత్ అయ్యత్తన్ భేటీ: సినిమా చర్చలు ఊపందుకున్నాయి!
- హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ – దింజిత్ కాంబో సెట్ అయ్యే అవకాశం!
- దింజిత్ కి రొయ్యల బిర్యానీ వడ్డించిన ప్రభాస్: ఆతిథ్యానికి ఫిదా అయిన డైరెక్టర్!
- సలార్ 2, కల్కి 2099 సినిమాలతో పాటు ప్రభాస్ కొత్త ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సంచలనానికి తెరలేపారు! మలయాళ దర్శకుడు దింజిత్ అయ్యత్తన్ తో మీటింగ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మలయాళ దర్శకుడితో ప్రభాస్ భేటీ: అసలేం జరిగింది?
Prabhas : ఇటీవల రాజాసాబ్ తో నిరాశపరిచినా ప్రభాస్ లైనప్ భారీగానే ఉంది. త్వరలో ఫౌజీ అనే సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత కల్కి 2, స్పిరిట్, సలార్ 2.. ఇలా పెద్ద లైనప్ ఉంది. అలాగే సలార్ నిర్మాణ సంస్థతో మూడు సినిమాలు చేస్తారని కూడా ప్రకటించారు. అందుకోసం దర్శకులను వెతికే పనిలో పడ్డారట.
తాజాగా మలయాళ దర్శకుడు దింజిత్ అయ్యత్తన్ ప్రభాస్ ని కలవడం, మీటింగ్ పెట్టడంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని భావిస్తున్నారు. దింజిత్ అయ్యత్తన్ మలయాళంలో కిష్కింధ కాండం, ఎకో, కక్షి.. లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి స్టార్ దర్శకుడు అయ్యాడు.
రొయ్యల బిర్యానీ ట్రీట్: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా!
తాజాగా దింజిత్ అయ్యత్తన్ ప్రభాస్ ని కలిసిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. సూపర్‌స్టార్ ప్రభాస్ తో అద్భుతమైన సమయం గడిపాను. సరదా కబుర్లతో సాయంత్రం హాయిగా గడిచిపోయింది. ముఖ్యంగా ఆయన వడ్డించిన ప్రాన్స్ రొయ్యల బిర్యానీ టేస్ట్ బాగుంది. నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్ సార్‌కి, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన విజయ్ సార్‌కి, అలాగే హోంబలే ఫిల్మ్స్‌కి స్పెషల్ థ్యాంక్స్ అని తెలిపాడు.
హోంబలే ఫిల్మ్స్ ప్లాన్: ప్రభాస్ తో మరో సినిమా?
దీంతో హోంబలె నిర్మాణ సంస్థ ప్రభాస్ తో ఈ డైరెక్టర్ కి కథ చెప్పడానికి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఆతిథ్యం గురించి తెలిసిందే. అందుకే డైరెక్టర్ దింజిత్ అయ్యత్తన్ కి స్పెషల్ రొయ్యల బిర్యానీ పెట్టించాడు ప్రభాస్. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఉందా లేక ఊరికే కలిసారా తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
ప్రభాస్, దింజిత్ అయ్యత్తన్ కలయికలో సినిమా వస్తుందో లేదో చూడాలి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.


