
ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ ‘రాజాసాబ్’ ట్రైలర్‌తో తిరిగి వచ్చింది. వరుస యాక్షన్ సినిమాల తర్వాత డార్లింగ్ చలాకీగా కనిపించడం ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. రజనీకాంత్ చంద్రముఖిలా ‘రాజాసాబ్’ బ్లాక్ బస్టర్ అవుతుందని వారు ఆశిస్తున్నారు.
Key Points
ప్రభాస్ 'రాజాసాబ్' ట్రైలర్‌తో వింటేజ్ కామెడీ లుక్‌లో తిరిగి వచ్చాడు.
రజనీకాంత్ 'చంద్రముఖి'తో పోలుస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రభాస్ మళ్లీ ఇలా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ 14 గంటల్లో 70 లక్షల వ్యూస్ సాధించి, సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్.
డార్లింగ్ వింటేజ్ లుక్, కామెడీకి ఫ్యాన్స్ ఫిదా
వరుసగా యాక్షన్ సినిమాలతో, ఎలివేషన్ మూవీస్ తో సాగిపోతున్నాడు ప్రభాస్. ఒకప్పుడు బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ అంటూ కామెడీ టైమింగ్ తో, స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టాడు ప్రభాస్. కానీ ఇటీవల ఆయన నుంచి ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి వింటేజీ లుక్ కానీ రాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు ‘ది రాజాసాబ్’ వచ్చేస్తోంది.
ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. వింటేజీ లుక్ మాత్రమే కాదు, అప్పటి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొడుతున్నాడు డార్లింగ్. రీసెంట్ గా రిలీజైన రాజా సాబ్ ట్రైలర్ తో ఇది మరోసారి స్పష్టమైంది. ఇందులో ప్రభాస్ ను చూసిన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ చలాకీగా, కామెడీ టైమింగ్ తో కనిపించడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. రాజాసాబ్ మూవీతో ప్రభాస్ మళ్లీ 14 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంటున్నారు. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ ను మళ్లీ ఇలా చూస్తామో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి, సాహో, సలార్, కల్కి.. ఇలా ప్రభాస్ వరుసగా మాస్ ఎలివేషన్ సీన్లు ఉన్న మూవీలు చేశాడు.
రజనీ ‘చంద్రముఖి’తో రాజాసాబ్ పోలికలు
రాజాసాబ్ ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు చంద్రముఖిలా రెబల్ స్టార్ ప్రభాస్ కు రాజాసాబ్ నిలిచిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదని రివ్యూవర్ ఆదిరెడ్డి ఎక్స్ లో పోస్టు చేశాడు.
‘‘వావ్. ఇంత బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇంత భారీగా ఉంటుందని కూడా అనుకోలేదు. పూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ కు రప్పించేలా ఈ సినిమా కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఎలివేషన్ మూవీస్ మాత్రమే చేస్తున్న ప్రభాస్ ను ఇలా కంప్లీట్ డిఫరెంట్ కామెడీ ప్లస్ హారర్ లో చూడటం ఎక్సైటింగ్ గా ఉంది’’ అని ఆది రెడ్డి పోస్టు చేశాడు.
‘రాజాసాబ్’ రిలీజ్, యూట్యూబ్ రికార్డులు
ప్రభాస్ అన్నా, ట్రైలర్ అదిరిపోయిందని నటుడు సత్యదేవ్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ప్రభాస్ ఎనర్జిటిక్ గా, ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారని మరో హీరో నారా రోహిత్ పేర్కొన్నడు. ఫుల్ మీల్స్ పెడుతున్న డైరెక్టర్ మారుతికి మరో డైరెక్టర్, నటుడు సందీప్ రాజ్ లవ్యూ సార్ అని చెప్పాడు.
సెప్టెంబర్ 29న రిలీజైన ట్రైలర్ యూట్యూబ్ లో 14 గంటల్లో 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమా 2026 సంక్రాంతి రేసులో నిలవబోతుంది. జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రాజాసాబ్ సినిమాకు మారుతి డైరెక్టర్. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీఎఫ్ ఎంటర్ టైన్మెంట్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్, ఇషాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లు.
మొత్తంగా, ‘రాజాసాబ్’ ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


