
📌 Key Points
- ‘ది రాజాసాబ్’ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్.
- ‘నాచే నాచే’ పాట ప్రోమో తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- బాలీవుడ్ ‘డిస్కో డ్యాన్సర్’ పాటను రీమిక్స్ చేసి థమన్ దీనికి సంగీతం అందించారు.
- పూర్తి ‘నాచే నాచే’ పాట జనవరి 5వ తారీఖున విడుదల కానుంది.
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నాచే నాచే’ సాంగ్ ప్రోమో విడుదలైంది. బాలీవుడ్ రీమిక్స్‌గా వస్తున్న ఈ డ్యాన్స్ నంబర్‌లో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులు వేశారు. పూర్తి పాట జనవరి 5న విడుదల కానుంది.
‘నాచే నాచే’ ప్రోమో దుమ్మురేపింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) రూపొందిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రభాస్ డ్యాన్స్.. హీరోయిన్ల గ్లామర్
అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘రెబల్ సాబ్’ ‘సహానా సహానా’ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ది మోస్ట్ అవైటెడ్ ‘నాచే నాచే’ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన ‘డిస్కో డ్యాన్సర్’ మూవీలోని ‘నాచే నాచే’ సాంగ్‌ను రీమిక్స్ చేస్తూ, థమన్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కు ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడు.
ఫుల్ సాంగ్ విడుదల ఎప్పుడు?
ఇందులో భాగంగా తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి కలర్‌ఫుల్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో చిందులు వేయనున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ ఫీస్ట్ ఇవ్వడంతో పాటు ప్రభాస్‌తో స్టన్నింగ్ స్టెప్స్ వేయించబోతున్నారు. కాగా ఫుల్ సాంగ్ జనవరి 5వ తారీఖున రిలీజ్ కానుంది.
మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ది రాజాసాబ్’ నుంచి వస్తున్న ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది. ప్రోమోతోనే రికార్డులు సృష్టిస్తున్న ఈ సాంగ్ పూర్తి వెర్షన్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
