
📌 Key Points
- ప్రభాస్ ‘రాజాసాబ్’ 2026 సంక్రాంతికి, ‘స్పిరిట్’ దసరా టైమ్ లో విడుదల కానున్నాయి.
- రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చి 2026లో రిలీజ్, బుచ్చిబాబు డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
- చిరంజీవి ‘శంకర్ వరప్రసాద్’ సంక్రాంతికి, విజయ్ ‘జన నాయగన్’ అదే రోజున విడుదలవుతాయి.
- ‘జైలర్ 2’తో రజనీ, ‘టాక్సిక్’తో యశ్ 2026లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనున్నారు.
2026 సంవత్సరం తెలుగు సినీ ప్రియులకు పండగే! ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, విజయ్, రజనీకాంత్, యశ్ వంటి అగ్ర తారల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. రాజాసాబ్, పెద్ది, శంకర్ వరప్రసాద్ వంటి క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ తేదీలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ భారీ ప్రాజెక్టులు: రాజాసాబ్, స్పిరిట్
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రాజాసాబ్. కామెడీ, హారర్ జానర్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాకు మారుతి దాసరి దర్శకత్వం వహించారు. ‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ రెండు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించని పెద్ది సినిమా కూడా 2026లో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతోంది. రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, విజయ్ చంద్రశేఖర్ కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా 2026 మార్చ్ లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెెక్షన్ లో ఈసినిమా తెరకెక్కుతోంది.
2026 సంక్రాంతి కానుకగా రాబోతున్న మరో సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా గురించి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కమెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.
రామ్ చరణ్, చిరంజీవిల 2026 ప్లాన్స్
విజయ్ దళపతి కెరీర్ లో చిట్టచివరి సినిమా ‘జన నాయగన్. ఈసినిమా తరువాత దళపతి విజయ్ ఇండస్ట్రీని వదిలేసి.. పూర్తిగా రాజకీయల్లోకి వెళ్లిపోబోతున్నాడు. అందుకే పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ‘రాజాసాబ్’తో ఈమూవీ పోటీ పడనుంది, ఎందుకంటే ఇది కూడా జనవరి 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. వినోద్ కూమార్ ఈసినిమాకు దర్శకుడు.
రీసెంట్ గానే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. భారీ యాక్షన్ సీన్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈసినిమాను స్టార్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో స్పిరిట్ తెరకెక్కుతోంది. ప్రభాస్ ఈసినిమాలో డిపరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 దసరా టైమ్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
విజయ్, రజనీకాంత్, యశ్ ల పాన్ ఇండియా సత్తా
ఈ రిలీజ్ ల జాబితాలో ‘జైలర్ 2’ సినిమా పేరు కూడా ఉంది. 2023లో విడుదలైన జైలర్ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కింది. 2026లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై సౌత్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో యశ్‌తో పాటు నయనతార, టోవినో థామస్, కియారా అద్వానీ, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ తరువాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో… టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం మీద 2026 సంవత్సరం సినీ అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని పంచనుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.


