
📌 Key Points
- ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో ఘాటు రొమాన్స్, నాటు యాక్షన్ చేయనున్నాడు.
- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.
- ఫస్ట్ లుక్ లో ప్రభాస్ సిక్స్ ప్యాక్, త్రిప్తి డిమ్రి రొమాంటిక్ లుక్ వైరల్.
- లిప్ కిస్ సీన్స్, భారీ యాక్షన్ తో ఫ్యాన్స్‌కు ‘ఫుల్ మీల్స్’ ఖాయం.
ప్రభాస్ తన ‘స్పిరిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో, త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఘాటు రొమాన్స్, సిక్స్ ప్యాక్ తో అదరగొట్టనున్నాడు. లిప్ కిస్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ భారీగా అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ ‘స్పిరిట్’: కొత్త అవతార్ లో రెబల్ స్టార్
ప్రభాస్ ఘాటు రొమాన్స్ తో పాటు నాటు యాక్షన్ చేయబోతున్నాడని తెలుస్తుంది.(Prabhas)
Prabhas : ప్రభాస్ బాహుబలి నుంచి అన్ని భారీ, స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో రాధేశ్యామ్ ప్రేమకథ చేసినా, అందులో కాస్త రొమాన్స్ ఉన్నా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత ప్రభాస్ ఘాటు రొమాన్స్ తో పాటు నాటు యాక్షన్ చేయబోతున్నాడని తెలుస్తుంది.(Prabhas)
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే హీరో – హీరోయిన్స్ మధ్య ఘాటు రొమాన్స్, లిప్ కిస్ సీన్స్ ఉంటాయని తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. యాక్షన్ కూడా అదే లెవల్లో ఉంటుంది. ఇవన్నీ A సర్టిఫికెట్ సినిమాలే.
సందీప్ వంగా మార్క్ రొమాన్స్, యాక్షన్
దీంతో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా పోలీస్ పాత్ర కాబట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని ఫ్యాన్స్ భావించారు. అయితే నేడు న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా తన సిక్స్ ప్యాక్ బాడీపై అక్కడక్కడా దెబ్బలు తగిలితే కట్లు కట్టి ఉండగా హీరోయిన్ త్రిప్తి డిమ్రి ప్రభాస్ సిగరెట్ వెలిగిస్తూ చీరలో అందంగా కనిపించింది.
త్రిప్తి డిమ్రి, లిప్ కిస్: ఫ్యాన్స్ అంచనాలు
ఈ పోస్టర్ చూస్తుంటేనే యాక్షన్ సీన్ తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సందీప్ రెడ్డి సినిమా కావడం, యానిమల్ లో రొమాన్స్ తో అదరగొట్టిన త్రిప్తి డిమ్రి కూడా ఉండటంతో కచ్చితంగా ఈసారి ప్రభాస్ – త్రిప్తి డిమ్రి కి లిప్ కిస్ సీన్స్ ఉంటాయని, ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఇక యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయని స్పిరిట్ సినిమా ప్రకటించినప్పుడే అర్ధమయిపోయింది. మొత్తానికి ప్రభాస్ రొమాంటిక్ సీన్స్, సిక్స్ ప్యాక్ తో త్వరలోనే ఫ్యాన్స్ ని అలరించనున్నాడని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కంఫర్మ్ అని అంటున్నారు.
మొత్తంగా, ‘స్పిరిట్’ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజమైన ఫుల్ మీల్స్ అందించనున్నాడు. సందీప్ వంగా మార్క్ ఘాటు రొమాన్స్, భారీ యాక్షన్, సిక్స్ ప్యాక్ అవతార్ తో రెబల్ స్టార్ అలరించడం ఖాయం.


