
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘స్పిరిట్’ మూవీ నుండి అద్భుతమైన అప్‌డేట్ విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ పాత్రతో పాటు, ప్రభాస్ మాస్ వార్నింగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథాంశంపై అంచనాలు పెరిగాయి.
Key Points
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా 'స్పిరిట్' మూవీ నుండి అదిరిపోయే అప్‌డేట్ విడుదలైంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు.
సినిమాలో ప్రకాష్ రాజ్ జైలు సూపరింటెండెంట్ పాత్రలో నటించారు.
"నాకొక చెడ్డ అలవాటుంది" అంటూ ప్రకాష్ రాజ్ కు ప్రభాస్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
స్పిరిట్ మూవీ అప్‌డేట్ హైలైట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అక్టోబర్ 23 గురువారం ఘనంగా జరిగాయి. దెస వ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు.
ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ నోట్ లో ముగిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయే పడేట్టు ఇచ్చారు. స్పిరిట్ మూవీ కథని సౌండ్ రూపంలో తెలియజేస్తూ ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ప్రభాస్ పాత్ర గురించి తెలియజేసేలా, కథ గురించి హింట్ ఇచ్చేలా ఈ వీడియోలో డైలాగులు ఉన్నాయి.
ప్రభాస్ పాత్ర పరిచయం: ఐపీఎస్ ఆఫీసర్
పాత్రలో ప్రభాస్ వీడియోలో ఉన్న డైలాగుల ప్రకారం..జైలుకి రిమాండ్ విధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకువస్తారు. ఆ జైలు సూపరింటెండెంట్ గా ప్రకాష్ రాజ్ ఉంటారు. ప్రకాష్ రాజ్ మాటలని బట్టి చూస్తే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అర్థం అవుతోంది. రిమాండ్ విధించిన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో కాదు.. ప్రభాసే. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, అకాడమీ టాపర్ అని ప్రకాష్ రాజ్ కి కానిస్టేబుల్ పరిచయం చేస్తారు. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్ ఉన్నా లేకున్నా బిహేవియర్ లో తేడా ఉండదని.. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఒక సారి టెర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్.. అతనికి ఇది రిమాండ్ పీరియడ్ అని కానిస్టేబుల్ చెబుతాడు. నా కాంపౌండ్ లో రెండే యూనిఫామ్ లు ఉంటాయి ఒకటి ఖాకీ లేదా ఖైదీ అని ప్రకాష్ రాజ్ అంటారు. వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్టుకి పంపండి అని ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు వినొచ్చు.
ఇక చివర్లో ప్రకాష్ రాజ్ కి ప్రభాస్ ఇచ్చే వార్నింగ్ అదిరిపోయింది. మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి చెడ్డ అలవాటు ఉంది. దానినే ఇంగ్లీష్ లో మరోసారి ప్రభాస్ రిపీట్ చేస్తాడు.
ప్రకాష్ రాజ్ – ప్రభాస్ మధ్య మాస్ వార్నింగ్
సో సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఈ పడేట్టు తో స్పిరిట్ మూవీ థీమ్ అర్థం అవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఐపీఎస్ అధికారిగా ఉంటాడు. ఎవరినీ లెక్క చేయని బిహేవియర్. ఓ కేసులో ప్రభాస్ కి రిమాండ్ విధిస్తారు. ఇదంతా ఎందుకు జరిగింది అనే ఆసక్తిని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఒక్క వీడియోతో పెంచేశారు. ఈ మూవీలో వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మొత్తంగా, ‘స్పిరిట్’ మూవీ వీడియో ప్రభాస్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్ర, డైలాగులు సినిమాపై ఆసక్తిని, అంచనాలను అమాంతం పెంచాయి. సందీప్ రెడ్డి వంగా వినూత్న ప్రచారంతో సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.


