|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విగ్గు లేకుండా ప్రభాస్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా? బాబోయ్‌ మైండ్ బ్లాక్‌, ఫోటో వైరల్‌.. ఇందులో నిజం ఏంటంటే?

Published: 18-07-2025, 3:49 AM
విగ్గు లేకుండా ప్రభాస్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా? బాబోయ్‌ మైండ్ బ్లాక్‌, ఫోటో వైరల్‌.. ఇందులో నిజం ఏంటంటే?

ప్రభాస్ విగ్ లేకుండా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు నిజమేనా, లేక ఏదైనా ఎడిటింగ్ చేసారా అనేది ప్రశ్నార్థకం. గ్రోక్ ఈ ఫోటో నిజమని ధ్రువీకరించింది.

Key Points

1

ప్రభాస్ విగ్ లేకుండా ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.

2

ఫోటో నిజమా కాదా అనేది చర్చనీయాంశం.

4

రాజా సాబ్ షూటింగ్ సమయంలో ఇలాంటి లుక్ లో కనిపించారని తెలుస్తోంది.

వైరల్ అవుతున్న ఫోటో

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన మన తెలుగు నటుడు కావడం మనకు దక్కిన గౌరవం. పాన్‌ ఇండియా సినిమా లెక్కలు మార్చేసిన నటుడు ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా, గ్లోబల్ రేంజ్‌ మూవీస్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. డార్లింగ్‌ పేరుతో ఇప్పుడు నాలుగైదు వేల కోట్ల వ్యాపారం జరుగుతుండటం విశేషం.

ప్రభాస్‌ ఎప్పుడూ విగ్ తోనే కనిపిస్తారు. లేదంటే క్యాప్‌తో కనిపిస్తారు. కానీ విగ్గు లేకుండా కనిపించడం చాలా అరుదు. తాజాగా ఆయన విగ్గు లేకుండా ఉన్న లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

డార్లింగ్‌ ఫ్యాన్స్  ని మాత్రమే కాదు, కామన్‌ ఆడియెన్స్ ని, సినీ ప్రియులను ఇది ఆశ్చర్యపరుస్తుంది. విగ్గులేకుండా ప్రభాస్‌ ఇలా ఉంటారా అనే నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు.

నిజమా లేక ఫేకా?

ఇందులో విగ్గులేకుండా సరికొత్తగా ఉన్నారు డార్లింగ్‌. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోల్లో నిజం ఎంతా అనేది క్లారిటీ లేదు.

ప్రభాస్‌ విగ్గులేకుండా ఎప్పుడూ బయటకు రారు, కానీ ఇది ఎలా లీక్‌ అయ్యిందనేది అందరికి సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిందా? లేక అలాంటి పోలికలు ఉన్న వేరే ఎవరైనా అనేది క్లారిటీ రావాల్సింది.

ఇదిలా ఉంటే దీనిపై ట్విట్టర్‌(ఎక్స్)లో గ్రోక్‌ని ప్రశ్నించారు కొందరు నెటిజన్లు. ప్రభాస్‌ ఫోటో నిజమా? ఫేకా? చెప్పు అని అడగ్గా గ్రోక్‌ మాత్రం పెద్ద షాకిచ్చింది. ఇది నిజమే అని, ఫేక్‌ కాదని తెలిపింది. ప్రభాస్‌ గతంలోనూ ఇలాంటి లుక్‌లో కనిపించారని,

గ్రోక్ ప్రకటన

`రాజా సాబ్‌` షూటింగ్ సమయంలో ఆయన ఇలా విగ్గులేకుండా కనిపించారని గ్రోక్‌ చెప్పింది. ఇటీవల బహిరంగంగా ఇలానే కనిపిస్తున్నారని, కానీ సినిమాల్లో పాత్రల కోసం ఆయన విగ్గు ధరిస్తున్నట్టు చెప్పడం విశేషం. అభిమానులు ఇలాంటి లుక్ ని గతంలో కూడా చూశారని తెలిపింది.

మొత్తంగా ఇప్పుడు ప్రభాస్‌ విగ్గులేని ఫోటో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.

అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` మూవీ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. త్వరలోనే సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` మూవీని స్టార్ట్ చేయనున్నారు. వీటితోపాటు ప్రశాంత్‌ వర్మ మూవీ, `సలార్‌ 2`, `కల్కి 2` సినిమాలు చేయాల్సింది ప్రభాస్‌.

మొత్తం మీద, ప్రభాస్ విగ్ లేకుండా ఉన్న ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నిజానిజాలను అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.