|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ షాకింగ్ డెసిషన్! ఇన్నేళ్లు చేయని పని.. ‘స్పిరిట్’ కోసం మాస్ ప్రామిస్! ఫ్యాన్స్ వెయిటింగ్!

Published: 08-01-2026, 10:01 AM
ప్రభాస్ షాకింగ్ డెసిషన్! ఇన్నేళ్లు చేయని పని.. 'స్పిరిట్' కోసం మాస్ ప్రామిస్! ఫ్యాన్స్ వెయిటింగ్!
  • ప్రభాస్ ‘రాజాసాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • ‘స్పిరిట్’ కోసం మొదటి రోజు థియేటర్‌లో ఫ్యాన్స్‌తో సినిమా చూస్తానని ప్రభాస్ ప్రామిస్.
  • సాధారణంగా సినిమాలు వారం తర్వాత చూసే ప్రభాస్, ఈసారి తన రూల్ బ్రేక్ చేస్తున్నాడు.
  • KGF 2, కల్కి చిత్రాలు చూసిన అనుభవాలను పంచుకున్న డార్లింగ్, మాస్ ఎక్స్పీరియన్స్ అన్వేషణ.

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రభాస్ ఇచ్చిన మాస్ ప్రామిస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఇన్నేళ్లుగా తాను చేయని పనిని ఇప్పుడు చేయబోతున్న ప్రభాస్ వ్యాఖ్యలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది!

స్పిరిట్ కోసం డార్లింగ్ మాస్ ప్రామిస్!

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి, ప్రభాస్ గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.(Prabhas)

అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా మీరు, ఆ అనుభవం మీకు లేదు కదా, అసలు మీ సినిమాలు మీరు చూస్తారా అని సందీప్ రెడ్డి వంగ అడిగాడు.

ఫస్ట్ డే ఫస్ట్ షో – ప్రభాస్ కొత్త ప్లాన్!

దానికి ప్రభాస్ మాట్లాడుతూ.. నా సినిమాలు నేను రిలీజ్ రోజు చూడను. ఒక వారం రోజుల తర్వాత చూస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ షో యుఫొరియా మిస్ అవుతాను అని చెప్తారు. స్పిరిట్ కి వెళదాం. నువ్వు ఆల్రెడీ అడిగావు నేను ప్రామిస్ చేశాను వస్తాను. నాకు సినిమా రిలీజ్ మొదటి రోజు చాలా స్ట్రెస్ ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కొన్ని డేస్ తర్వాత చూస్తాను.

ఇలాగే థియేటరికల్ అనుభవం అని చెప్పి KGF 2 సినిమాకు మా కజిన్స్, ఫ్రెండ్స్ తో ప్రసాద్ ల్యాబ్ లో సినిమా చూసాను. వాళ్లంతా నన్ను తీసుకెళ్లారు. అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ సినిమాని. ఆ అనుభవం మర్చిపోను. కల్కి సినిమాకు కూడా అలాగే వెళ్ళాము. అయితే సెకండ్ హాఫ్ లో నాకు, అమితాబ్ సర్ మధ్య జరిగే ఫైట్ లో నా కోసం అరవట్లేదు. అమితాబ్ సర్ కోసం అరుస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. వాళ్లంతా నా కజిన్స్, ఫ్రెండ్స్ అయినా నా కోసం అరవట్లేదు. సినిమాలో నాది సెల్ఫిష్ పాత్ర, అమితాబ్ గారిది హీరోయిక్ పాత్ర కాబట్టి సినిమాకు కనెక్ట్ అయ్యారని అప్పుడు అర్థమైంది అని తెలిపాడు.

కేజీఎఫ్ 2, కల్కి అనుభవాలు చెప్పిన డార్లింగ్!

దీంతో రాజాసాబ్ కూడా ప్రభాస్ ఫస్ట్ డే చూడడు అనే తెలుస్తుంది. స్పిరిట్ సినిమా ప్రభాస్ మొదటి రోజు ఏ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య కూర్చొని చూస్తాడో చూడాలి.

ప్రభాస్ ఈ సంచలన నిర్ణయం ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మొదటిరోజు థియేటర్‌లో డార్లింగ్‌ను చూడాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని క్రేజీ అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాం, మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.