
📌 Key Points
- ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘LIC’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
- ఈ సినిమా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బయ్యర్లు ఆసక్తి చూపడం లేదు.
- విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాత కామెడీ స్టైల్‌లో ఉండటంతో యూత్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
- తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కనీస స్థాయి బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయారు.
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘LIC’ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనితో సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి.
తగ్గిన ప్రమోషన్ల జోరు
LIC Movie:లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్… అంటూ వరుసగా మూడు సినిమాల్ని వందకోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ ప్రదీప్ రంగ నాథన్ స్పీడ్ కి బ్రేకులు పడట్టే కనిపిస్తుంది. అవును మాములుగా ఇంతటి క్రేజున్న హీరో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద హంగామా మాములుగా ఉండదు. కానీ రేపే అంటే ఏప్రిల్ 10 న రాబోతున్న ఈ సినిమా అసలు వస్తుందన్న విషయం తెలీనట్టే కనిపిస్తుంది. దీంతో ఈ కుర్ర హీరోకి తొలిసారి ప్లాప్ ఎదురు కాబోతుందా అన్న టాక్ వినిపిస్తుంది.
విఘ్నేష్ శివన్ పాత స్టైల్ కామెడీని మళ్ళీ రుద్దుతున్నాడా ?
వాస్తవానికి ప్రదీప్ తొలిసినిమా లవ్ టుడే తర్వాత కమిట్ అయిన ప్రాజెక్ట్ ఇది.కానీ విఘ్నేష్ శివన్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకోవడం,అలాగే షూటింగ్ బాగా డిలే కావడం వల్ల సినిమా ఏకంగా రెండేళ్లు వెనక్కి వెళ్ళిన పరిస్థితి . ఈ లోపు ప్రదీప్ నుంచి మరో రెండు సినిమాలు రావడం, వందకోట్ల క్లబ్ లోకి చేరిపోవడం జరిగిపోయాయ్ . టీజర్లు, ట్రైలర్లు చూస్తుంటే విఘ్నేష్ శివన్ పాత స్టైల్ కామెడీని మళ్ళీ రుద్దుతున్నట్టు అనిపించడంతో యూత్ ఈ సినిమాను లైట్ తీసుకున్నట్టు బుకింగ్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది.. ప్రమోషన్ల కోసం చివరి నిమిషంలో హడావిడి చేశారు కాని ఆడియన్స్ లో చూడాలన్న ఇంట్రెస్ట్ ని తెప్పించకలేకపోయారు.
బయ్యర్ల ఆసక్తి లేమి
ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
ఇక సినిమాని విఘ్నేష్ శివన్ భార్య అయిన నయనతార, లలిత్ కుమార్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించింది. కానీ, బయ్యర్ల దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. తమిళనాడులోని మెయిన్ సెంటర్స్ లో అనుకున్నంతగా బిజినెస్ కాకపోవడంతో చేసేదేం లేక తక్కువ రేట్లకు అమ్ముకోవడమే కాకుండా, సేఫ్టీ కోసం కొన్ని చోట్ల సొంతంగానే రిలీజ్ చేస్తున్నారట. ఇక తెలుగు మార్కెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగులో ఈ సినిమాకు మినిమం బజ్ కూడా క్రియేట్ చేయడంలో టీమ్ విఫలమైందనే చెప్పాలి. రేపు రిలీజ్ పెట్టుకుని, ఇవాళ బుకింగ్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్ష రూపాయల గ్రాస్ కూడా రావడం కష్టమేనా అన్నట్టుగా ఉంది.
ఈ సినిమాకు కూడా వంద కోట్లు రాకపోతే
తెలుగులో క్రియేట్ కానీ బజ్
మరో వైపు అమెరికా మార్కెట్‌లో ‘LIC’ చుట్టూ పెద్ద డ్రామానే నడిచింది. మొదట ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ మొత్తానికి అగ్రిమెంట్ చేసుకుంది. కానీ, సినిమా క్వాలిటీ మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం చూసి, ఆ సంస్థ ‘రిస్క్ తీసుకోవడం మా వల్ల కాదు’ అంటూ చేతులెత్తేసిందట. ఫలితంగా రిలీజ్‌కు రెండు రోజుల ముందు వేరే చిన్న సంస్థలను వెతుక్కోవాల్సి వచ్చింది. దీనివల్ల బుకింగ్స్ పోర్టల్స్ ఆలస్యంగా ఓపెన్ అయ్యాయి.ఇక రేపు ప్రీమియర్స్ షోలకు కూడా వెలవెలబోయే థియేటర్లు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.మరో వైపు ప్రదీప్ రంగనాథన్ “నేను వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చాను కాబట్టి, ఈ సినిమాకు కూడా వంద కోట్లు రాకపోతే ఫెయిల్యూర్ అనే ముద్ర వేస్తారు. అందుకే నాకు వంద కోట్లు ముఖ్యం కాదు, సినిమాను జనం చూస్తే చాలు”అంటూ తన ప్రెస్ మీట్‌లలో ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతున్నాయ్.సినిమాపై కాన్ఫిడెంట్ లేకే ప్రదీప్ ఇలా కవరప్ చేసుకొచ్చాడు అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.
‘LIC’ గట్టెక్కడం అసాధ్యమేనా ?
ఇక దీంతో పాటే అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ జంటగా వస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ బరిలో ఉండటం, సరిగ్గా వారం గ్యాప్‌లో అంటే ఏప్రిల్ 17 న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ రేసులోకి వస్తుండటం, మరో వైపు మరిన్ని సినిమాలు బరిలో ఉండటం చూస్తుంటే ‘LIC’ గట్టెక్కడం అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది.చూడాలి మరి అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ప్రదీప్ నాలుగోసారి వంద కోట్లని వెనకేస్తాడా ..లేక తొలిసారి త్వరగానే చాప చుట్టెస్తాడా !
మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ ‘LIC’ చిత్రం విడుదలవుతున్నా, మునుపటి క్రేజ్ లేకపోవడం గమనార్హం. సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఏ మేరకు ఉంటాయో వేచి చూడాలి.


