|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“ఈ వయసులో అవసరమా?” అని అన్నవాళ్లకి ఇదే నా సమాధానం.. ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన ప్రగతి

Published: 11-12-2025, 12:48 AM
"ఈ వయసులో అవసరమా?" అని అన్నవాళ్లకి ఇదే నా సమాధానం.. ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన ప్రగతి
  • నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో ఒక బంగారు, మూడు రజత పతకాలు గెలుచుకుంది.
  • టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఈ ఘనత సాధించింది.
  • తన వయసును ఉద్దేశించి ట్రోల్ చేసిన వారికి ‘ఈ వయసులో అవసరమా?’ ప్రశ్నకు గట్టి సమాధానం ఇచ్చింది.
  • జిమ్ బట్టలపై, వయసుపై కామెంట్లపై ఆమె స్పందన నెట్టింట వైరల్ అయింది.

పవర్ లిఫ్టింగ్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్న నటి ప్రగతిని కొందరు ‘ఈ వయసులో అవసరమా?’ అంటూ ట్రోల్ చేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రగతి, తనను విమర్శించిన వారికి దీటైన సమాధానం ఇచ్చింది. ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రగతి అద్భుత విజయం: పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అమ్మగా, అత్తగా, వదినగా ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాలకు ద‌గ్గ‌రైన‌ నటి ప్రగ(Pragathi) మనందరికీ సుపరిచితమే. ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. అయితే ఆమె సినిమాలతోనే కాకుండా మరో రంగంలో తన ప్రతిభను కనబరుస్తూ వావ్ అనిపిస్తుంది. అయితే నటి ప్రగతి గత కొంతకాలంగా పవర్ లిఫ్టింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి, పలు జాతీయ–అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోన్న విషయం విదితమే. మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ తన జోష్, కష్టపడి సాధించిన ఫలితాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

“ఈ వయసులో అవసరమా?”: ట్రోల్స్‌పై ప్రగతి స్పందన

ఇందులో భాగంగా తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025లో ప్రగతి పాల్గొని… ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలతో మొత్తం నాలుగు పతకాలు గెలుచుకుంది. ఈ అద్భుత విజయంతో ప్రగతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇక ఆమె సాధించిన ఈ ఫీట్‌పై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతుంటే మరికొంత మంది మాత్రం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే తాజాగా త్రీ రోజెస్ సీజన్-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గోన్న ప్రగతి ఈ ట్రోలర్స్ పై స్పందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు.. మీకు ఈ వయసులో అవసరమా అని బాగా ట్రోల్స్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

దీనికి నాకు కూడా డౌట్ వచ్చింది.. ఇంత అసహ్యంగా, దరిద్రంగా తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. నేనేమన్నా తప్పు చేస్తున్నానా.. నాకూ ఎదిగిన పాప ఉంది స్కూల్‌కి పోతుంది. తనను ఈ ట్రోల్స్ చూసి వాళ్ల ఫ్రెండ్స్ ఏమైనా ఇన్సల్ట్ చేస్తారేమో అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు చెప్తున్నా ఆ ట్రోలర్స్ అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. జిమ్‌కి జిమ్ బట్టలే వేసుకోవాలి. చీర, చుడీదార్‌లో చేయలేము. “ఈ వయసులో అవసరమా?” అని అన్నవాళ్లకి ఇప్పుడు సమాధానం వచ్చిందనుకుంటా’ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రగతి తన వయసును, దుస్తులను విమర్శించిన ట్రోలర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆమె సాధించిన విజయాలు, కష్టం ఆమె మాటలకు బలం చేకూర్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.