|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేమ్ రక్షిత్‌కు మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ సెల్యూట్! ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సంచలనం!

Published: 12-03-2026, 2:05 PM
ప్రేమ్ రక్షిత్‌కు మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ సెల్యూట్! ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సంచలనం!
  • ప్రేమ్ రక్షిత్ టాలెంట్ చూసి ఫిదా అయిన మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్.
  • ప్రేమ్ రక్షిత్‌ను అభినందిస్తూ విన్సెంట్ ప్యాటర్సన్ ప్రత్యేక వీడియో సందేశం.
  • ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ గెలుచుకున్న ప్రేమ్ రక్షిత్.
  • 200 పైగా తెలుగు, తమిళ సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్.

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్ అభినందించారు. ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు ముగ్ధుడైన విన్సెంట్, వీడియో సందేశం పంపారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విన్సెంట్ ప్యాటర్సన్ ప్రశంసలు

Prem rakshith : ప్రపంచ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్. ఆయన ఇప్పుడు భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. ఇది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేసిన విన్సెంట్ ప్యాటర్సన్ ఇటీవల ప్రేమ్ రక్షిత్‌కు ప్రత్యేక వీడియో మెసేజ్ పంపాడు. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

“హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌ని. చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశాను. నీ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిన్ను నిజంగా అభినందిస్తున్నాను. నీవు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు తమ కలలు సాధిస్తున్నారు. ఎదో రోజు నిన్ను కలుస్తాను రక్షిత్” అంటూ విన్సెంట్ చెప్పాడు.ఈ మెసేజ్‌కు ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇస్తూ “చిన్నప్పటి నుంచి స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం ఒక కొరియోగ్రాఫర్‌గా నాకు చాలా ప్రత్యేకం. ధన్యవాదాలు ప్రియమైన విన్సెంట్ సర్” అని రాశాడు.

ప్రేమ్ రక్షిత్ ప్రస్థానం

చెన్నైలో పెరిగిన ప్రేమ్ రక్షిత్ ‘ఛత్రపతి’ సినిమాతో ప్రభాస్‌తో ప్రయాణం మొదలుపెట్టాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, రంగ్ దే బసంతి, సర్కార్, భోళా శంకర్, అపరిచితుడు వంటి 200కి పైగా తెలుగు, తమిళ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇప్పుడు మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ నుంచి ప్రశంసలు రావడం భారతీయ డాన్స్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు లభించినట్టే.ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రేమ్ రక్షిత్ ఫ్యాన్స్ సంబరాల్లో ఉన్నారు. ఇది భారతీయ కొరియోగ్రఫీకి గర్వకారణం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ప్రేమ్ రక్షిత్ ఇలాంటి ప్రశంసలు అందుకోవడం యంగ్ కొరియోగ్రాఫర్లకు స్పూర్తిగా నిలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో

?igsh=MWwyZ29pMnA4amNmNw%3D%3D

ప్రేమ్ రక్షిత్‌కు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు, ఎంతో మంది యువ కొరియోగ్రాఫర్లకు స్ఫూర్తిదాయకం. భారతీయ నృత్య కళాకారులకు ఇది గర్వకారణం. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.