|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పొట్టు పొట్టు కొట్టుకుంటున్న మొగుడు.. పెళ్లాం.. నవ్వులు, థ్రిల్స్‌తో ఆకట్టుకుంటున్న ‘ప్రేమంటే’ టీజర్

Published: 02-11-2025, 5:02 PM
పొట్టు పొట్టు కొట్టుకుంటున్న మొగుడు.. పెళ్లాం.. నవ్వులు, థ్రిల్స్‌తో ఆకట్టుకుంటున్న ‘ప్రేమంటే’ టీజర్

ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ‘ప్రేమంటే’ సినిమా టీజర్ విడుదలైంది. థ్రిల్ ప్రాప్తిరస్తు ట్యాగ్‌లైన్‌తో లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Key Points

1

ప్రియదర్శి, ఆనంది జంటగా 'ప్రేమంటే' చిత్రంలో నటించారు.

2

టీజర్ హాస్యం, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

4

నవంబర్ 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

‘ప్రేమంటే’ టీజర్ విశేషాలు

ప్రియదర్శి (Priyadarshi)హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ విభిన్న పాత్రలతో సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ‘ప్రేమంటే’ (premante) సినిమాతో ప్రేమలో పడేసేందుకు సిద్ధమవుతున్నారు. థ్రిల్ ప్రాప్తిరస్తు ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి నవనీత్ శ్రీరామ్(Navaneeth Sriram) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుమ కనకాల, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈ నేపథ్యంలో.. ప్రమోషనల్ కంటెంట్ పెంచే ప్రయత్నంలో భాగంగా చిత్రబృందం అప్డేట్లను షేర్ చేస్తుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘ప్రేమంటే’ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆనంది, ప్రియదర్శి భార్యభర్తలుగా నటించారు. థ్రిల్స్, కామెడీ నేపథ్యంలో.. జనాలను నవ్విస్తోంది. పొట్టు పొట్టు కొట్టుకోవడానికే ప్రియదర్శి, ఆనంది పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అన్ని గొడవలతో మొదలైన వీరి కాపురంలోకి ఓ లేడీ కానిస్టేబుల్ సుమ ఎంటర్ అవుతుంది. చిలకా గోరింకల్లా ఉన్న జంటలకు విడాకులు ఇప్పటించడంలో ఆమె దిట్ట. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. అంతటితో టీజర్ పూర్తి అవగా.. ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తారాగణం, చిత్రబృందం

విడుదల తేదీ, అంచనాలు

‘ప్రేమంటే’ టీజర్ ప్రేక్షకుల అంచనాలను పెంచింది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీతో పాటు సుమ, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. నవంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.